Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పోస్ట్‌.. అదిరే పంచ్ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌!!

Guys, wash your hands: KL Rahul comments on Shreyas Iyer, Hardik Pandya’s video
KL Rahul Comments On Shreyas Iyer & Hardik Pandya Instagram Video

ఢిల్లీ: మహమ్మారి 'కరోనా' వైరస్‌ పంజా విసురుతుండడంతో క్రీడారంగం ఒక్కసారిగా అతలాకుతం అయ్యింది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌పై ఇది పెను ప్రభావమే చూపించింది. వైరస్ దెబ్బకు మొదట ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని పలు బోర్డులు భావించినా.. ప్రజల, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం అని భావించి ముందు జాగ్రత్తగా అన్నీ వాయిదా వేసాయి. కరోనాతో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు కాగా.. మరోవైపు ప్రపంచంలోనే టాప్‌ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్‌-13ను ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది.

సోషల్ మీడియాతో టైం పాస్

సోషల్ మీడియాతో టైం పాస్

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఖాళీ సమయం దొరికింది. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు. ఒకవైపు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు, మరోవైపు ఐపీఎల్‌ 2020 వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో చాలామంది ఆటగాళ్లు చేసేదేంలేక సామాజిక మాధ్యమాలతో కాలం టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు.

మీ చేతులు కడుక్కోండి:

'ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ' అంటూ శ్రేయస్‌ రెండు ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశాడు. ఒక చిత్రంలో దాదాపు కోటి రూపాయాల విలువైన చేతి గడియారం (వాచ్) పెట్టుకొని ఉన్నాడు. అయితే రెండో చిత్రంలో అది హార్దిక్‌ పాండ్యాదని తెలుస్తుంది. ఎందుకంటే.. శ్రేయస్‌ గడియారం పెట్టుకొన్న చేతి తనదే అన్నట్టు కెమేరా ట్రిక్కు ప్రదర్శించాడు. శ్రేయస్‌ పోస్టుకు కేఎల్‌ రాహుల్‌ పంచ్ ఇచ్చాడు. 'గాయ్స్‌.. మీ చేతులు కడుక్కోండి' అని కామెంట్ పెట్టాడు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాహుల్ అలా చురకంటించాడు.

క్రికెటర్లు ఎంతో బిజీగా ఉండేవారు:

క్రికెటర్లు ఎంతో బిజీగా ఉండేవారు:

శ్రేయస్‌ పోస్టును టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌, ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, టెస్ట్ ఆటగాడు హనుమ విహారి లైక్‌ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజం చెప్పాలంటే.. మార్చి నెలలో క్రికెటర్లు ఎంతో బిజీగా ఉండేవారు. తమ ఫ్రాంచైజీల శిబిరాల్లో సాధన చేస్తూ గడిపేవారు. మైదానాల్లో ఎంతో సందడి ఉండేది. మహమ్మారి కరోనా ముప్పుతో ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేయడంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు.

జూన్‌-సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్:

జూన్‌-సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్:

కరోనా పరిస్థితులు ఎలాగుంటాయో ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ఏప్రిల్‌ 15 తర్వాత ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్‌ను జూన్‌-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. ఐపీఎల్‌-2009ని దక్షిణాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, కొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించేందుకు యోచిస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని బట్టి మొత్తం టోర్నీని తరలిస్తే ఎలా ఉంటుందని చర్చించారట.

Story first published: Wednesday, March 18, 2020, 13:57 [IST]
Other articles published on Mar 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+