Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs ENG: న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ సాధించిన ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్! (Video)

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ హ్యాట్రిక్ సాధించాడు. నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీలను వరుస బంతుల్లో ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. స్టన్నింగ్ డెలివరీతో నాథన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత షార్ట్ లెంగ్త్ బంతితో హెన్రీని గోల్డెన్ డకౌట్ చేశాడు.

అట్కిన్సన్ వేసిన బంతిని తప్పించడానికి ప్రయత్నించి గల్లీలోని బెన్ డకెట్‌కు హెన్రీ చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టిమ్ సౌథిని వికెట్ల ముందు దొరకబుచ్చుకుని అట్కిన్సన్ హ్యాట్రిక్ సాధించాడు. 147 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 47వ హ్యాట్రిక్. 2021 తర్వాత ఇదే ప్రథమం. ఇక హ్యాట్రిక్ సాధించిన 15వ ఇంగ్లండ్ బౌలర్‌గా అట్కిన్సన్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ కంటే ముందు 2017లో మొయిన్ అలీ హ్యాట్రిక్ సాధించాడు.

Gus Atkinson Claims Hat-Trick Against New Zealand Joins Elite Club of England Bowlers

ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో గస్ అట్కిన్సన్ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో వచ్చిన అతని కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. కాగా, అట్కిన్సన్ ధాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (37; 56 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ లాథమ్ (17; 32 బంతుల్లో, 1 ఫోర్), టామ్ బ్లండెల్ (16; 20 బంతుల్లో, 2 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (16; 16 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు. అట్కిన్సన్ (4/31), బ్రైడన్ కార్స్ (4/46) చెరో నాలుగు వికెట్లు తీశారు. స్టోక్స్ (1/21), వోక్స్ (1/26) తలో వికెట్ పడగొట్టారు.

ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో అయిదు వికెట్లకు 327 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (96; 118 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (92; 112 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) తృటిలో శతకాలు కోల్పోయారు. జో రూట్ (60*) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. టిమ్ సౌథి, మ్యాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 482 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది.

Story first published: Saturday, December 7, 2024, 10:42 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+