
హైదరాబాద్: విమర్శలకు సైతం అంచనాలకు అందకుండా సాగుతుంది ఈ సారి రంజీ మ్యాచ్. 198 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక స్కోరు 111/7. ఇక కర్ణాటక జట్టుకు టెయిలెండర్లు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతా కర్ణాటక చివరి రోజు 87 పరుగులు చేయలేదు, విదర్భకు విజయం తేలికగా వచ్చేస్తుందనుకున్నారు. కానీ కర్ణాటక పోరాటపటిమ ఆటను ఉత్కంఠభరితంగా మార్చేసింది. శాయశక్తులా పోరాడిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా గుర్భానీ:
టెయిలెండర్ల ప్రతిఘటనతో కర్ణాటక దాదాపు గెలిచినంత పని చేసింది. స్వేచ్ఛగా ఆడిన వినయ్ కుమార్ (36) గుర్బాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికీ స్కోరు జట్టు స్కోరు 141 ఉంది. ఆ తర్వాత మిథున్ (33), గోపాల్ (24 నాటౌట్) పోరాడడంతో కర్ణాటకకు 189/8 స్కోరు రావడంతో విజయానికి చేరువైనట్లు భావించింది. కానీ అద్భుత బౌలింగ్‌ను కొనసాగించిన గుర్బాని.. మిథున్, అరవింద్ (2)లను వరుస ఓవర్లలో ఔట్ చేసి విదర్భను విజయపథంలో నడిపించాడు. అతడికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
యువ పేసర్ రజనీష్ గుర్బాని సంచలన బౌలింగ్‌తో విదర్భ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం రసవత్తరంగా ముగిసిన సెమీఫైనల్లో ఆ జట్టు 5 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటకకు షాకిచ్చింది. మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన గుర్బాని.. విదర్భ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అతడుతొలి ఇన్నింగ్స్‌లోనే 5/94తో కర్ణాటకను హడలెత్తించాడు. ఈ రెండో ఇన్నింగ్స్‌లోనూ 7/68తో, దాదాపు ఒంటి చేత్తో విదర్భకు విజయాన్నందించాడు. విదర్భ ఈ నెల 29న ఆరంభమయ్యే ఫైనల్లో దిల్లీతో తలపడుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.