Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gupta+ill=Guptill: గుప్టిల్‌కు సెహ్వాగ్ నిర్వచనం

రాంచీ: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. తన సహచర ఆటగాళ్లతో పాటు ప్రస్తుత ఆటగాళ్లపై కూడా ట్విట్టర్‌లో మంచి హాస్యాన్ని సెహ్వాగ్ పండిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరిస్‌లో కామెంటర్ అవతారం ఎత్తి అభిమానులను అలరిస్తున్నాడు. కామెంట్రీ బాక్సులో తన సరదా మాటలతో సెహ్వాగ్ చెలరేగిపోతున్నాడు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు రాంచీలో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో తొలిసారి టాస్ గెలిచిన సంగతి తెలిసిందే.

మిశ్రా ఆ క్యాచ్‌ పట్టి ఉంటే, ఫలితం మరోలా ఉండేది

అంతేకాదు ఐదు వన్డేల సిరిస్‌లో నిలబడాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనను చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 15.3 ఓవర్లలో 96 పరుగులు జోడించారు. ఓపెనర్లు లాథమ్ 39, మార్టిన్ గుప్తిల్ 72 మంచి శుభారంభాన్ని ఇచ్చారు.

Guptill was Gupta, he fell ill since then he is Guptill says Sehwag

ఆ తర్వాత జట్టు స్కోరు 138 పరుగులకు చేరాక గుప్టిల్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు రాణించడంతో నిర్ణీత ఓవర్లకు గాను 261 పరుగుల చేసింది. అయితే గుప్టిల్ చేసిన 72 పరుగులు భారత్ పరాజయానికి, న్యూజిలాండ్ గెలుపుకు కీలకమయ్యాయి.

4వ వన్డే: అతడిని ఔట్ చేయడమే మ్యాచ్‌లో కీలక మలుపు

గుప్టిల్ బ్యాటింగ్ చేసే సమయంలో సెహ్వాగ్ కామెంట్రీ బాక్సులో ఉన్నాడు. గుప్టిల్ ఆటతీరుకు ముచ్చటపడి... గుప్టిల్ మనోడే అంటూ పేరు గుప్తా... ఒకసారి జబ్బు(ఇల్) పడటంతో గుప్టిల్ (gupta + ill = guptill) అయ్యాడు అని వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

అయితే గుప్టిల్‌ను గుప్తా అని అభివర్ణించింది సెహ్వాగ్ ఒక్కడే కాకపోవడం విశేషం. గతంలో సుసు స్వామి అనే రాజకీయ నాయకుడు మార్టిన్ గుప్టిల్‌ మన భారతీయుడే అని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతడి పేరు మార్టిన్ గుప్టిల్ కాదని.. మారుతి గుప్తా అని, అతడు పెరిగింది ఇండియాలోనే అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+