Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ‌ప్టిల్‌: నాడు ఒక్క మ్యాచ్‌లోనే 237 నాటౌట్‌..నేడు అన్నీ క‌లిపి 167!

ICC Cricket World Cup 2019 : Martin Guptill Scored Just 167 Runs In 9 Innings
 Guptill scored 237 in one match in 2015 WC, Scored 167 in all matches in 2019 WC

మాంచెస్ట‌ర్‌: న్యూజిలాండ్ డాషింగ్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ భారీ స్కోరును సాధించ‌డంలో మ‌రోసారి దారుణంగా విఫ‌లం అయ్యాడు. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో గ‌ప్టిల్ ఒక ప‌రుగే చేశాడు. దీనికోసం 14 బంతులను ఎదుర్కొన్నాడీ టాలెస్ట్ బ్యాట్స్‌మెన్‌. జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిజానికి- మార్టిన్ గ‌ప్టిల్ ఓ విధ్వంస‌కారుడు. ఒక్క‌సారి క్రీజులో కుదురుకుంటే భారీ షాట్ల‌ను అల‌వోక‌గా ఆడ‌గ‌ల‌డు. ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొన‌గ‌ల దిట్ట‌. త‌న‌దైన ట్రేడ్‌మార్క్ షాట్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

క‌ళ్లు చెదిరే షాట్లు..
దీనికి నిద‌ర్శ‌నం- 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అతని బ్యాటింగే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఆ మెగా టోర్న‌మెంట్‌లో గ‌ప్టిల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. వెల్లింగ్ట‌న్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలింగ్ తుత్తునీయ‌లు చేశాడు. 163 బంతుల్లోనే 237 ప‌రుగులు చేశాడు.

ఓపెన‌ర్‌గా వెళ్లి, 50 ఓవ‌ర్లు ఆడాడు. నాటౌట్‌గా నిలిచాడు. అత‌ని స్కోర్‌లో 11 సిక్స‌ర్లు, 24 బౌండ‌రీలు న‌మోద‌య్యాయంటే గ‌ప్టిల్ ఏ స్థాయిలో ఆడాడో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌ప్టిల్ ధాటికి ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 393 ప‌రుగులు చేసింది. 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో..గ‌ప్టిల్ క‌ళ్లు చెదిరే గ‌ణాంకాల‌ను న‌మోదు చేసుకున్నాడు. టోర్న‌మెంట్ మొత్తం మీద 547 ప‌రుగులు చేశాడు. 68.37 అత‌ని స్ట్రైక్ రేట్‌. రెండు సెంచ‌రీల‌ను బాదేశాడు.

క‌ళ్లు చెమ‌ర్చే ఆట‌తీరు..
అలాంటి బ్యాట్స్‌మెన్ నాలుగేళ్లు తిరిగే స‌రికి ఫామ్‌ను కోల్పోయాడు. ప‌రుగుల కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. దారుణంగా విఫ‌లం అయ్యాడు. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక పరుగు తీయ‌డానికి 14 బంతుల‌ను గ‌ప్టిల్ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌తాడో, లేదో తెలియ‌దు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌ని గ‌ణాంకాలు తీవ్ర నిరాశ‌ను క‌లిగిస్తున్నాయి.

రౌండ్‌-రాబిన్ లీగ్ ద‌శ‌లో తొమ్మిది మ్యాచుల‌ను ఆడిన గ‌ప్టిల్ 166 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. సెమీ ఫైన‌ల్‌లో చేసిన ఒక ప‌రుగును కౌంట్‌లోకి తీసుకుంటే ఇప్ప‌టిదాకా అత‌ను చేసిన ర‌న్స్ 167. స‌గ‌టు 20.87. ఈ టోర్న‌మెంట్‌లో అత‌ని అత్య‌ధిక స్కోరు 73 ప‌రుగులే.

Story first published: Tuesday, July 9, 2019, 16:12 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+