
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరిస్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. క్రిస్ట్‌చర్చ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంకో వన్డే మిగిలుండగానే మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ మిథున్(57), షబ్బీర్ రెహ్మాన్(43)లు మాత్రమే రాణించడంతో బంగ్లాదేశ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా, టాడ్ ఆస్ట్లే, నీషమ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్‌లకు తలో వికెట్ లభించింది. అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 36.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది.
న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(118) సెంచరీ సాధించి జట్టు ఘన విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో కూడా గుప్టిల్(117) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.