For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలే టెస్టుకు దూరం: ధావన్ షాట్‌కు లంక క్రికెటర్ వేలు చిట్లింది

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలర్ లాహిరు కుమార బౌలింగ్‌లో ధావన్ కొట్టిన బంతిని.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అసేలా గుణరత్నె క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం, గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గుణరత్నె తడబడ్డాడు.

బొటనవేలిని చీల్చుకుంటూ

బొటనవేలిని చీల్చుకుంటూ

ఈ తడబాటుతో అతని ఎడమచేతి బొటనవేలిని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుణరత్నెని కొలంబోకి సర్జరీ కోసం తరలించినట్లు శ్రీలంక చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య వెల్లడించాడు. మిడిలార్డర్‌లో గుణరత్నె గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు.

మూడు టెస్టుల సిరీస్‌కి దూరమయ్యే సూచనలు

మూడు టెస్టుల సిరీస్‌కి దూరమయ్యే సూచనలు

అయితే ఈ గాయం కారణంగా గుణరత్నే ఈ మూడు టెస్టుల సిరీస్‌కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి టెస్టులో ధావన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దీంతో ధావన్ తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు.

టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు

టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు

టీమిండియా టీ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 75, కోహ్లి ఒక ప‌రుగుతో క్రీజులో ఉన్నారు. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అయితే టెస్టుల్లో ధావన్‌కి ఇదే అత్య‌ధిక స్కోరు. గ‌తంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అత‌ను అధిగ‌మించాడు.

టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన ధావన్

టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన ధావన్

అప్ప‌ట్లో ఆ స్కోరుని కూడా ధావన్ తొలి రోజే సాధించ‌డం విశేషం. ఇప్పుడు కేవ‌లం 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేశాడు. ధావన్ ఇన్నింగ్స్ టీ20ని తలిపించింది. తొలి రోజు రెండో సెషన్‌లో 28 ఓవర్లు ఆడిన భారత్‌ వికెట్‌ నష్టపోయి 167 పరుగులు సాధించింది. రెండో వికెట్‌కి ధావన్‌-పుజారాల జోడీ 253 పరుగులు సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+