Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేం నిండా మునిగాం: మిమ్మ‌ల్నీ ముంచి తీరుతాం: ఆఫ్ఘ‌న్ కేప్టెన్ వార్నింగ్‌!

Gulbadin Naib’s message to Bangladesh

లండ‌న్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కూడా క్ర‌మంగా స్లెడ్జింగ్ దిగుతోంది. మ్యాచ్‌కు ముందు ప్ర‌త్య‌ర్థిని ఉద్దేశించి- ఘాటు వ్యాఖ్యాలు చేస్తోంది. మాట‌ల‌ను తూటాల్లా పేల్చుతోంది. దానికి కాస్త వ్యంగ్యాన్ని జోడించి మ‌రీ ప్ర‌త్య‌ర్థిని జ‌ట్టు ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ గుల్బదీన్.. బంగ్లాదేశ్ జ‌ట్టును ఉద్దేశించి చేసిన వ్య‌ఖ్యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. స‌ర‌దాగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ..దానిలో చాలా ఆంత‌ర్యం క‌నిపిస్తోంది. ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి బ‌ల‌మైన జ‌ట్ల‌ను ఓడించి, ఇంగ్లండ్ జ‌ట్టుపై 333 ప‌రుగులను చేసి, ఊపు మీదున్న బంగ్లాదేశ్ క్రికెట‌ర్లను రెచ్చ‌గొట్టేలా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశార‌ని అంటున్నారు.

సెమీస్ ఆశ‌ల‌కు గండి కొడుతుందా?

సెమీస్ ఆశ‌ల‌కు గండి కొడుతుందా?

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- ఆఫ్ఘ‌నిస్తాన్ సోమ‌వారం బంగ్లాదేశ్‌ను ఢీ కొట్ట‌బోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీ ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకోవాల‌ని బంగ్లాదేశ్ భావిస్తోంది. దీనికోసం క‌స‌ర‌త్తు చేస్తోంది. అదే స‌మ‌యంలో.. బంగ్లాదేశ్ విజ‌యాన్ని అడ్డుకోవ‌డానికి ఆఫ్ఘ‌న్ వ్యూహాల‌ను ప‌న్నుతోంది. బంగ్లాదేశ్ దూకుడును క‌ట్ట‌డి చేయాల‌ని భావిస్తోంది. ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు సెమీఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు ఎంత మాత్ర‌మూ లేవు. ఈ మ్యాచ్‌ను గ‌న‌క ఆఫ్ఘ‌నిస్తాన్ గెలిస్తే.. బంగ్లాదేశ్‌ జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌కు వెళ్ల‌డం దాదాపు అసాధ్యం అవుతుంది. ఈ ఉద్దేశంతోనే గుల్బ‌దీన్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు చెబుతున్నారు.

మేము నిండా మునిగాం..

మేము నిండా మునిగాం..

ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో తాము నిండా మునిగిపోయామ‌ని, ఇక బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టును కూడా ముంచేస్తామ‌ని గుల్బ‌దీన్ చెప్పుకొచ్చారు. తాము సెమీఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు లేవ‌ని, బంగ్లాదేశ్ జ‌ట్టును కూడా అడ్డుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. `హ‌మ్ డూబ్ చుకె హై స‌న‌మ్‌. తుమ్‌కో లేక‌ర్ డూబేంగే..` అని ఓ సెటైరిక‌ల్‌గా ఓ వార్నింగ్ మెసేజీని ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గుల్బ‌దీన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో త‌మ స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డి, విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మిగిలిన జ‌ట్ల‌తో పోల్చుకుంటే.. బంగ్లాదేశ్ జ‌ట్టుతో ఎక్కువ సార్లు ఢీ కొన్న అనుభ‌వం త‌మకు ఉంద‌ని అన్నారు. బంగ్లాదేశ్ విజ‌యాల‌కు క‌ళ్లెం వేస్తామ‌ని చెప్పారు.

బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘ‌నిస్తాన్‌కు మెరుగైన రికార్డ్‌..

బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘ‌నిస్తాన్‌కు మెరుగైన రికార్డ్‌..

నిజానికి- బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టుకు మెరుగైన రికార్డే ఉంది. 2014 నుంచి ఇప్ప‌టిదాకా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మొత్తం ఏడు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో జ‌రిగాయి. వాటిల్లో నాలుగింటిని మాత్ర‌మే బంగ్లాదేశ్ గెలుచుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టుకు కోల్పోయింది. 2014లో నిర్వ‌హించిన ఆసియా క‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ఆసియా క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో 32 ప‌రుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై ఘ‌న విజ‌యాన్ని సాధించింది ఆఫ్ఘ‌నిస్తాన్‌. అలాంటి విజ‌యాన్ని పున‌రావృతం చేయాల‌ని ఆఫ్ఘ‌నిస్తాన్ ఆశిస్తోంది.

Story first published: Monday, June 24, 2019, 12:15 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+