
అవసరమైతే నేను కూడా బౌలింగ్ చేస్తా
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. 'మేము ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. తాజా వికెట్‌పై ఆడుతున్నప్పుడు వికెట్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. తొలుత బౌలర్లకు కొంచెం ఎడ్జ్ ఉంటుందని భావిస్తున్నా. తొలుత ప్రత్యర్థిని ఎన్ని పరుగులకు కట్టడి చేస్తామో తెలిస్తే.. మా బ్యాటింగ్ లైనప్‌తో ఛేజింగ్ పరంగా మా వ్యూను ఏర్పరుచుకోవచ్చు. మాకు ఆ విషయంలో స్పష్టత లభిస్తుంది. ఇక మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బౌలింగ్‌లో మాకు దాదాపు ఏడుగురు ప్లేయర్లు బౌలింగ్ చేయగలరు. అవసరమైతే నేను కూడా బౌలింగ్ చేస్తాను' అని తెలిపాడు.

త్వరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది
టాస్ ఓడిన విలియమ్సన్ మాట్లాడుతూ.. 'పిచ్ బాగుంది. మా జట్టులో సుచిత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ చేరాడు. సుందర్ త్వరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది. మా జట్టుకు అతను కీలక ఆటగాడు. ఉమ్రాన్, నట్టూ తమ బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మ్యాచ్‌ల మధ్య మాకు తగినంత స్పేస్ దొరుకుతుంది. అది మాకు ఉపయోగపడుతుంది.' అని పేర్కొన్నాడు.

తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ( కెప్టెన్ ), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ ( వికెట్ కీపర్ ), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్ ), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయభేరి
ఈ సీజన్లో గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయభేరి మోగించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తోడు అభిషేక్ శర్మ (42), నికోలస్ పూరన్ (34*) రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌పై సన్స్‌రైజర్స్ హైదరాబాద్ 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఏకైక ఓటమి రుచి చూపించింది కూడా సన్ రైజర్సే. తొలుత సన్ రైజర్స్ బౌలర్లు సమిష్టిగా రాణించడతో గుజరాత్ టైటాన్స్ 162-7 స్కోరు మాత్రమే చేయగలిగింది. తర్వాత సన్ రైజర్స్ 19.1ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది.


Click it and Unblock the Notifications












