Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : కొత్త అవతారంలో ఐపీఎల్ ఛాంపియన్స్.. కొత్త జెర్సీ విడుదల చేసిన గుజరాత్!

Gujarat Titans unveil new jersey before IPL 2023

గత ఐపీఎల్ సీజన్ విజేత గుజరాత్ టైటాన్స్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్త ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా కనిపించేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే తమ కొత్త జెర్సీని ఈ జట్టు ప్రకటించింది. గతేడాది కొత్తగా ఐపీఎల్‌లో చేరిన రెండు ఫ్రాంచైజీల్లో గుజరాత్ టైటాన్స్ ఒకటన్న సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్సీతో ఐపీఎల్ 2022లో గుజరాత్ అద్భుతంగా రాణించింది. ఫైనల్‌లో సంజూ శాంసన్ నేతృత్వంలోనే రాజస్థాన్ రాయల్స్‌తో తలపడి ట్రోఫీ నెగ్గింది.

అదే జోరులో ఈ ఏడాది కూడా అద్భుతంగా రాణించేందుకు గుజరాత్ టైటాన్స్ రెడీ అయింది. ఈ క్రమంలోనే తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. తమ పాత బ్లూ జెర్సీకే చాలా చిన్న మార్పులు మాత్రమే చేసిందీ ఫ్రాంచైజీ. 'మా జెర్సీలో స్టార్‌ పెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. అందరూ ప్రేమించే జెర్సీ మా గెలిచే స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ జెర్సీ విడుదలను చూడండి' అంటూ గుజరాత్ టైటాన్స్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు కొత్త జెర్సీ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది ఐపీఎల్‌లో సూపర్‌గా రాణించిన గుజరాత్.. వరుస విజయాలతో మొట్టమొదటగా నాకౌట్స్‌లో అడుగు పెట్టింది. తాము ఆడిన 14 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించింది. అనంతరం తొలి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో మరోసారి రాజస్థాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ట్రోఫీ గెలిచి, తమ తొలి సీజన్‌లోనే ట్రోఫీ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ తర్వాత భారత జట్టులో కూడా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే భారత జట్టులో రోహిత్ లేనప్పుడు టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా వన్డేల్లో కూడా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ లభించింది.

Story first published: Friday, March 10, 2023, 12:09 [IST]
Other articles published on Mar 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+