IPL Auction 2023: స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న జట్లు.. జడ్డూ కోసం గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం!

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ జరగనుంది. కోచి వేదికగా దీన్ని డిసెంబరు 23న నిర్వహించనున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. దీని కన్నా ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ ఊపందుకుంది. కొంతమంది ఆటగాళ్లు కొన్ని ఫ్రాంచైజీలు ఇతర జట్లకు ట్రేడ్ చేసుకుంటున్నాయి.

బెంగళూరు నుంచి ముంబైకి..
ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జేసన్ బెహ్రండాఫ్‌ను ట్రేడ్ చేసుకుంది. ఈ క్రమంలో అతను ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా తమ జట్టులోని కివీస్ పేసర్ లోకీ ఫెర్గూసన్, ఆఫ్ఘన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ట్రేడ్ చేసుకుంది.

జాబితా విడుదల ఎప్పుడంటే?
ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ తెవాటియాను రవీంద్ర జడేజాతో ట్రేడ్ చేసుకుందామని ప్రయత్నించిందట జీటీ యాజమాన్యం. కానీ చెన్నై జట్టు ససేమిరా అనేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మినీ ఆక్షన్ ముందే తాము ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందీ, ఎవర్ని వదులుకుంటుందీ తదితర వివరాలన్నీ ఆయా జట్లు ఐపీఎల్ యాజమాన్యానికి తెలపాల్సి ఉంది. దీనికి నంబరు 15 వరకు గడువు ఉంది. ఆ రోజునే ఏయే జట్టు ఎవరిని వదులకుంది? ఎవరిని అట్టిపెట్టుకుంది? అనే వివరాలను విడుదల చేస్తారట.

స్టార్ ఆటగాళ్ల విడుదల..
చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్.. రాయుడు, డ్వేన్ బ్రావోలను విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ముంబై ఇండియన్స్ జట్టేమో స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను విడుదల చేస్తోందట. సన్‌రైజర్స్ జట్టు నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్‌ను వదిలేసుకుంది. రాజస్థాన్ జట్టు యాజమాన్యం దేవదత్ పడిక్కల్, జిమ్మీ నీషమ్, రాసీ వాన్ డర్ డస్సెన్‌ను వదులుకుంది. ఢిల్లీ క్యాపిట్ జట్టు కూడా పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్‌ను రిలీజ్ చేసేసిందట. కేకేఆర్ జట్టు ఆరోన్ ఫించ్‌ను విడుదల చేసిందట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications