Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : గాయంతో కేన్ మామ కూడా ఐపీఎల్‌కు దూరం..!

ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్‌లో కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునేందుకు కేన్ మామ ప్రయత్నించాడు.ఈ క్రమంలో అతని కాలుకి గాయమైంది. బౌండరీ లైన్ ఆవల పడబోతున్న బంతిని ఒంటి చేత్తో ఆపిన అతను.. దాన్ని మళ్లీ మైదానంలోకి విసిరే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఒక కాలి పైనే ల్యాండ్ అవడం, ఆ కాలు కూడా జారడంతో కింద పడిపోయాడు. దీంతో నొప్పితో విలవిలాడి పోయాడు.

ఫిజియో సాయంతో కుంటుతూ మైదానం వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి కూడా కేన్ మామ రాలేదు. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ను పంపారు. అతను కాసేపు క్రీజులో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత అవుటైపోయాడు. ఈ క్రమంలో కేన్ మామకు తగిలిన గాయం తీవ్రమైందని తేలడంతో అతను ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.

Kane Williamson ruled out 2

అయితే కేన్ మామకు గాయం మాత్రం గట్టిగా తగిలిందని, అతను ఈ సీజన్ ఆడటం ఇక కష్టమేనని అంటున్నారు. ఈ క్రమంలో కేన్ మామ స్థానంలో స్టీవ్ స్మిత్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకోవాలని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. దీంతో గాయాలతో ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్ల జాబితాలో కేన్ మామ కూడా చేరాడు. ఈ సీజన్‌లో మొత్తం పది జట్లు ఆడుతుంటే.. వీటిలో ఏడు జట్లలో ఆటగాళ్లు గాయాలతో ఐపీఎల్‌కు దూరం అవడం గమనార్హం.

ముంబై ఇండియన్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ఝై రిచర్డ్‌సన్ ఈ సీజన్ ఆడటం లేదు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముఖేష్ చౌదరి, కైల్ జేమీసన్ గాయాలతో దూరమయ్యారు. ఆర్సీబీకి విల్ జాక్స్ ఆడటం లేదు. పంజాబ్ జట్టుకు కీలకమైన జానీ బెయిర్‌స్టో కూడా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. యాక్సిడెంట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ఆడటం లేదు. రాజస్థాన్ రాయల్స్ ప్రధాన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ ఐపీఎల్ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కూడా చేరడం గమనార్హం.

Story first published: Saturday, April 1, 2023, 12:44 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+