Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2026 బెస్ట్ కెప్టెన్ అతనే: మహ్మద్ కైఫ్

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తోనే కాదు.. తన మైండ్‌తో కూడా అద్భుతంగా పనిచేశాడు. ఈ సీజన్లో బ్యాటర్‌గా ఇప్పటికే 600కు పైగా పరుగులు పిండుకున్న శుభ్‌మన్ గిల్.. తన అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో గుజరాత్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. గురువారం జరిగిన కీలక పోరులో సీఎస్కేను 89 పరుగుల భారీ తేడాతో ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌ను టోర్నీ నుంచి పంపించేశాడు. శుభ్‌మన్ గిల్ ప్రదర్శిస్తున్న ఈ ఆల్‌రౌండ్ లీడర్‌షిప్‌ను చూసిన భారత మాజీ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్లో శుభ్‌మన్ గిల్లే బెస్ట్ కెప్టెన్ అంటూ మహ్మద్ కైఫ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

శుభ్‌మన్ గిల్‌ను బెస్ట్ కెప్టెన్‌గా ప్రకటించిన మహ్మద్ కైఫ్
ఐపీఎల్ 2026లో శుభ్‌మన్ గిల్ ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్న తీరు అమోఘమని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. శుభ్‌మన్ గిల్ వ్యూహాలు, ముఖ్యంగా బౌలర్లను ఉపయోగించుకునే విధానం ఒక గొప్ప కెప్టెన్‌కు ఉండాల్సిన అసలైన లక్షణాలని ఆయన కొనియాడాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. "నా దృష్టిలో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి శుభ్‌మన్ గిల్లే బెస్ట్ కెప్టెన్. తన బౌలర్లను ఎలా వాడుకోవాలో తెలిసినవాడే గొప్ప కెప్టెన్ అవుతాడు. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ బౌలర్లు 14 మ్యాచ్‌లలో ఏకంగా 108 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ, పంజాబ్, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే వంటి పటిష్టమైన జట్లు గుజరాత్ బౌలింగ్ ధాటికి ఆలౌట్ అయ్యాయి. బౌలర్లు టెస్ట్ మ్యాచ్ తరహాలో ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసేలా శుభ్‌మన్ గిల్ వారిని గైడ్ చేస్తున్నాడు" అని మహ్మద్ కైఫ్ రాసుకొచ్చాడు.

Gujarat Titans captain Shubman Gill Is the Best Captain of IPL 2026 Says Mohammad Kaif

శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్, లీడర్‌షిప్ స్టైల్‌ను ప్రశంసిస్తూ మహ్మద్ కైఫ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "శుభ్‌మన్ గిల్ ఎలాంటి వంకర టింకర షాట్లు ఆడడు. అతను చాలా చాలా ఖచ్చితమైన, టెక్స్ట్‌బుక్ క్రికెట్ ఆడతాడు. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతం. దాంతో పాటు తన బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు" అని మహ్మద్ కైఫ్్ పేర్కొన్నాడు. 2024లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లిన తర్వాత గుజరాత్ యాజమాన్యం గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ కెప్టెన్సీలో జట్టు మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచి, తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అంతటి భారీ వారసత్వాన్నిముందుకు తీసుకెళ్లే ఒత్తిడి గిల్ భుజాలపై పడింది.

దారుణమైన ఆరంభం నుంచి.. టాప్-2 రేసు వరకు!
కెప్టెన్‌గా తన మొదటి సీజన్ (2024)లో శుభ్‌మన్ గిల్ జట్టును కేవలం 8వ స్థానంలో మాత్రమే నిలబెట్టగలిగాడు. కానీ ఆ తర్వాత గిల్ వెనుదిరిగి చూడలేదు. గతేడాది (2025) జట్టును మూడో స్థానంలో నిలిపి ప్లేఆఫ్స్ ఆడించిన గిల్.. ఈసారి ఐపీఎల్ 2026 లో 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఈ అసాధారణమైన కెప్టెన్సీ గ్రోత్ చూస్తుంటే, భవిష్యత్తులో టీమిండియాకు టెస్ట్, వన్డేలతో పాటు టీ20 ఫార్మాట్‌లోనూ శుభ్‌మన్ గిల్ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Friday, May 22, 2026, 14:02 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+