RR vs GT: భారీ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపిన హార్దిక్ పాండ్యా.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత భారీ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. మూడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా చివరి వరకు నాటౌట్‌గా నిలిచి గుజరాత్ టైటాన్స్‌కు భారీ స్కోర్ అందించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 193 పరుగుల భారీ లక్ష్యం ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి అభినవ్ మనోహర్ (43), డేవిడ్ మిల్లర్ (31*) సహకరించారు.

ఓపెనర్లు విఫలం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్లు మాథ్యు వేడ్(12) , విజయ్ శంకర్ (2) విఫలమవడంతో 15 పరుగులకే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది మంచి టచ్‌లో కనిపించిన వేడ్ రెండో ఓవర్లో డస్సెన్ అద్భుత త్రోతో రనౌట్ అయ్యాడు. ఇక మూడో ఓవర్లో కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి విజయ్ శంకర్ ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మరో ఓపెనర్ శుభ్‌గిల్ మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో రియాన్ పరాగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శుభ్‌మాన్ గిల్ (13) బౌండరీ లైన్ వద్ద ఫీల్గింగ్ చేస్తున్న హెట్‌మేయర్‌కు దొరికిపోయాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి సారి ఓ స్పిన్నర్‌కు ఔటయ్యాడు. దీంతో గుజరాత్ 53 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయింది.

హార్దిక్ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ గుజరాత్ టైటాన్స్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఆరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 139 పరుగుల వద్ద ఉండగా.. యజుర్వేంద్ర చాహల్ వేసిన 16వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 43 రన్స్, 4 ఫోర్లు, 2 సిక్సులు) అశ్విన్‌కు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ 139 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయింది.

హార్దిక్, మిల్లర్ బౌండరీల వర్షం
ఇక చివరి 4 ఓవర్లలో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి 27 బంతుల్లోనే అజేయంగా 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చివరి 5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులు సాధించింది. కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్లో ఓ సిక్సు, 3 ఫోర్లతో మిల్లర్ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. వీరిద్దరి దూకుడుతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. 8 ఫోర్లు, 4 సిక్సులతో 52 బంతుల్లోనే 87 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా నాటౌట్‌గా నిలిచాడు. ఇక 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 బంతుల్లోనే 31 పరుగులు చేసి మిల్లర్ నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, రియాన్ పరాగ్, యజుర్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications