Pro Kabaddi: టైటాన్స్‌కు మళ్లీ నిరాశే.. పోటీ కూడా ఇవ్వకుండా ఘోరపరాజయం

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. గత మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ చివరి వరకు పోటీ ఇచ్చిన టైటాన్స్ ఈ సారి అది కూడా లేకుండానే ప్రత్యర్థికి తలవంచింది. తాజాగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడినప్పటికీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేపోయింది. ఇక మరో మ్యాచ్‌లో యు ముంబాను పాట్నాపైరేట్స్ చిత్తు చేసింది.

చిత్తయిన టైటాన్స్
గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. గుజరాత్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి ఆరంభంలోనే పై చేయి సాధించారు. దీంతో ఫస్టాప్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 13-20తో వెనుకబడింది. ఇక సెకండాఫ్‌లోనూ టైటాన్స్ ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. ఎక్కడ కూడా మ్యాచ్‌లోకి వచ్చేలా కనిపించలేదు.
దీంతో మ్యాచ్ అసాంతం గుజరాత్ జెయింట్స్ అధిపత్యం చెలాయించింది. చివరకు టైటాన్స్ 22-40 పాయింట్ల తేడాతో ఘోరపరాజయం పాలైంది. టైటాన్స్ జట్టులో రజినీష్ దలాల్ మాత్రమే 12 పాయింట్లతో సత్తా చాటాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. గుజరాత్ జట్టులో రాకేష్ 16 పాయింట్లతో చెలరేగాడు. పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ ఏడో స్థానంలో ఉంది.

పాట్నా బిగ్ విక్టరీ
యు ముంబాతో జరిగిన మ్యచ్‌లో పాట్నా పైరేట్స్ బిగ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ మొత్తం పాట్నా అధిపత్యం చెలాయించడంతో ముంబా జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. 19-9 పాయింట్ల అధిక్యంతో పాట్నా జట్టు ఫస్టాప్ ముగించింది. ఇక సెకండాఫ్‌లోనూ పాట్నా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో చివరకు మ్యాచ్‌లో 43-23 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది.
పాట్నా జట్టులో నీరజ్ 8, సచిన్ 7, ప్రశాంత్ 7, మోను 6 పాయింట్లు సాధించారు. ఇక యు ముంబా జట్టులో అభిషేక్ 8, అక్షయ్ 4 పాయింట్లతో సత్తా చాటారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాట్నా మొదటి ప్లేసుకు వెళ్లింది. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆ జట్టు ఖాతాలో 34 పాయింట్లు ఉన్నాయి.

నేటి మ్యచ్‌లు
హర్యాణా స్టీలర్స్ VS యూపీ యోధా- రాత్రి 7:30 గంటలకు
దబాంగ్ ఢిల్లీ VS బెంగళూరు బుల్స్ - రాత్రి 8:30 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications