న్యూఢిల్లీ: నవంబర్ 9న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ హాజరుకానున్నారు. ఓ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కి రాజ్‌కోట్‌లోని ఎస్‌సీఏ స్టేడియం తొలిసారిగా ఆతిథ్యమిస్తుంది. దీంతో రాజ్ కోట్‌లోని స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొలిసారిగా టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) యోచిస్తుంది. ఇందులో భాగంగా సౌరాష్ట్ర నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన టెస్టు క్రికెటర్లను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కూడా ఎస్‌సీఏ ఆహ్వానించింది.

అయితే ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో స్పష్టత లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాత్రం ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించినట్లు ఎస్‌సీఏ మీడియా మేనేజర్ హిమన్షు షా వెల్లడించారు.
'టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ డే రోజున సీఎం వస్తారు. టీమిండియా టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మాజీ క్రికెటర్లు సలీమ్ దురాని, కర్సన్ గవ్రీ, యుజ్వేందర్ సింగ్, ధీరజ్ ప్రసన్నలతో పాటు ప్రస్తుతం టీమిండియా జట్టులో ఉన్న ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలకు సీఎం చేతుల మీదుగా సన్మానం జరగనుంది' అని ఆయన వివరించారు.
భారత్-ఇంగ్లాండ్ సిరిస్: తేదీలు, వేదికలు ఖరారు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరిస్ జనవరి 15, 2017న ప్రారంభం కానుంది. పూణెలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. జనవరి 26 నుంచి ట్వంటీ20 సిరిస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.
India-England series schedule:
Test matches to start at 9.30 AM IST
1st Test - November 9-13 (Wednesday to Sunday) - Rajkot
2nd Test - November 17-21 (Thursday to Monday) - Visakhapatnam
3rd Test - November 26-30 (Saturday to Wednesday) - Mohali
4th Test - December 8-12 (Thursday to Monday) - Mumbai
5th Test - December 16-20 (Friday to Tuesday) - Chennai