Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsSRH : స్టార్ ప్లేయర్ ఐపీఎల్ అరంగేట్రం.. ఫిలిప్స్‌ను పక్కన పెట్టేసిన సన్‌రైజర్స్!

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో టాప్-2లో నిలిచేందుకు గుజరాత్ టైటాన్స్ రెడీ అవుతోంది. ఇలా జరగాలంటే సన్‌రైజర్స్‌పై ఆ జట్టు గెలవాలి. ఈ మ్యాచ్‌లో కొత్త జెర్సీతో గుజరాత్ బరిలో దిగనుంది. కేన్సర్‌పై అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతో గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో లావెండర్ కలర్ జెర్సీలో ఆడుతోంది.

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ టాస్ నెగ్గాడు. పిచ్‌‌పై కొంత తేమ కనిపిస్తోందని, అందుకే తాము ఛేజింగ్ చేయాలని అనుకుంటున్నామని మార్క్రమ్ తెలిపాడు. అలాగే తమ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మార్కో యాన్సెన్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.

Glenn Phillips

అదే సమయంలో తమ జట్టు అంతా చాలా రిలాక్స్‌డ్‌గా ఉందని, చివరి మ్యాచ్ ఓటమి గురించి పెద్దగా టెన్షన్ పడటం లేదని గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా చెప్పాడు. మంచి క్రికెట్ ఆడాలని ప్లేయర్లు అందరూ అనుకుంటున్నట్లు తెలియజేశాడు. ఈ మ్యాచ్ జరుగుతోంది ఒక ఫ్రెష్ వికెట్ అని, తాను టాస్ గెలిచినా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే వాడినని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్ దాసున్ షనక ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నట్లు హార్దిక్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడానికి ముందు అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో షనక నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ ఏకంగా 227 టీ20లు ఆడిన తర్వాత కానీ ఐపీఎల్‌లో ఆడే అవకాశం అతనికి దక్కలేదు.

ఇక నెట్ ప్రాక్టీస్ సమయంలో విజయ్ శంకర్‌కు గాయమైందని, అతని స్థానంలో సాయి సుదర్శన్ ఆడుతున్నాడని హార్దిక్ తెలిపాడు. కేన్సర్ పేషెంట్లకు మద్దతుగా తాము కొత్త జెర్సీలో బరిలో దిగుతున్నామని, వారికి సపోర్ట్ తెలపడానికి ఇది ఒక మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డాడు.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, దాసున్ షనక, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మార్కో యాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్లాక్ ఫరూఖీ, టి నటరాజన్

Story first published: Monday, May 15, 2023, 19:49 [IST]
Other articles published on May 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+