For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GTvsSRH : సన్‌రైజర్స్‌పై కొత్త అవతారంలో డిఫెండింగ్ ఛాంపియన్స్.. గొప్ప కారణం కోసమే!

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కొత్త అవతారంలో కనిపించనుంది. ఇప్పటి వరకు డార్క్ జెర్సీతో చెలరేగుతున్న గుజరాత్.. సోమవారం నాడు జరిగే మ్యాచ్‌లో కొత్త జెర్సీలో కనిపిస్తుంది. కేన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరుకు మద్దతుగానే లావెండర్ కిట్‌లో పాండ్యా జట్టు కనిపిస్తుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్, సన్‌రైజర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లోనే తెల్లని జెర్సీలో గుజరాత్ జట్టు అలరించనుంది. ఈ విషయాన్ని గుజరాత్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

'ప్రత్యేకమైన కారణం కోసం లావెండర్ కలర్స్‌ ధరించేందుకు మేం రెడీగా ఉంది. అందరి ఆరోగ్యం బాగుండాలని గుజరాత్ టైటాన్స్ కోరుకుంటుంది. ఈ క్రమంలో కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు మా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కలవండి' అని గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంది.

gtsrh

ఇక గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఘోరమైన ఓటమి ఎదురు చూసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు.. గుజరాత్‌ను 27 పరుగుల తేడాతో చిత్తుచేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి విష్ణు వినోద్ (30) కొంత సహకారం అందించాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు తేలిపోయారు. వృద్ధిమాన్ సాహా (2), శుభ్‌మన్ గిల్ (6) ఇదదరూ విఫలమయ్యారు. మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), అభినవ్ మనోహర్ (2) కూడా ఫెయిలయ్యారు. ఇలాంటి సమయంలో విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (46) కొంత పోరాడారు. చివర్లో రషీద్ ఖాన్ (32 బంతుల్లో 79 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. చివరకు గుజరాత్ ఓడిపోయింది.

Story first published: Saturday, May 13, 2023, 12:40 [IST]
Other articles published on May 13, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+