Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsRR : గుజరాత్‌తో మ్యాచ్‌లో సంజూ కీలక నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్ అవుట్!

ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ రెడీ అవుతోంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచాడు. పిచ్ చూసి ఏమీ నిర్ణయించుకోలేక పోతున్నట్లు సంజూ చెప్పాడు. అయితే ముందుగా భారీ స్కోరు చేసి, గుజరాత్ ముందు గట్టి టార్గెట్ ఉంచాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.

అలాగే తమ జట్టులో ఒక కీలకమైన మార్పు చేసినట్లు సంజూ తెలిపాడు. ఈ ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోని జేసన్ హోల్డర్ స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆడిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకుముందు ఈ వేదికలో రాజస్థాన్ ఆడినప్పుడు జంపా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ చిన్న గాయంతో ఆడలేదు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న జంపా.. అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

GTvsRR :

పిచ్ చూసి ఒక అంచనా వేయలేకపోతున్నానని సంజూ చెప్పడం విన్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నవ్వేశాడు. అలాగే తమ జట్టులో దాదాపుగా ఎలాంటి మార్పులూ ఉంటాయని తాను అనుకోవడం లేదని చెప్పాడు. గుజరాత్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఆ మ్యాచ్ గెలవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

అదే సమయంలో రాజస్థాన్ కూడా తమ చివరి మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. కానీ భారీ స్కోరును కాపాడుకోవడంలో రాజస్థాన్ బౌలర్లు సఫలం కాలేదు. చివరి ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన టిమ్ డేవిడ్.. ముంబైకి విజయం అందించాడు. ఈ ఓటమి నుంచి రాజస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకుందో ఈ మ్యాచ్‌లో తెలుస్తుంది.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ,

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Friday, May 5, 2023, 19:21 [IST]
Other articles published on May 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+