Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsRR : గిల్ అవుటయ్యే సమయానికే దాదాపు గెలిచేశాం: హార్దిక్ పాండ్యా

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించింది. సొంత మైదానంలో జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బలమైన రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. గుజరాత్ స్పిన్నర్ల ధాటికి రాజస్థాన్ బ్యాటింగ్ ఏమాత్రం నిలవలేక విలవిల్లాడింది. దీంతో ఆ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుందీ జట్టు. రాజస్థాన్ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.

అదే సమయంలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్.. ఈ విజయంతో టేబుల్ టాపర్లుగా తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రాజస్థాన్ నిర్దేశించిన 118 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ కేవలం 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. దీంతో ఆ టీం నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. దీంతో పది మ్యాచులు ఆడిన జట్లు అన్నింటి కన్నా ఎక్కువ విజయాలతోపాటు, ఎక్కువ నెట్ రన్ రేట్ కూడా ఉన్న టీంగా గుజరాత్ నిలిచింది.

GTvsRR

గుజరాత్ స్పిన్నర్ల ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీళ్లిద్దరూ 39 పరుగులే ఇచ్చి ఐదు కీలక వికెట్లు తీసుకున్నారు. మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లను పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. ఈ విజయంపై గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. టీంలో స్పిన్నర్లను హ్యాండిల్ చేసే బాధ్యతను రషీద్ ఖాన్‌కే వదిలేస్తానని హార్దిక్ చెప్పాడు.

'ముఖ్యంగా నూర్ గురించి అంతా తనే చూసుకుంటాడు. వాళ్లు మాట్లాడే భాష కూాడా ఒకటే కాబట్టి.. నూర్‌తో మాట్లాడేందుకు రషీద్ కన్నా బెటర్ ఆప్షన్ మరొకరు లేరు. వాళ్లిద్దరూ బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్‌గా బౌలింగ్ చేస్తారు. ఇక కీపర్‌గా నాకు తెలిసి వృద్ధి వన్ ఆఫ్ ది బెస్ట్. జట్టుకు అతను ఈ విభాగంలో తీసుకొచ్చే విలువ చాలా ఎక్కువ' అని తెలిపాడు.

చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. 'చివరి మ్యాచ్‌లో నేను కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నా. అలాగే కొన్ని పొరపాట్లు కూడా చేశా. ఈ రోజు గిల్ అవుటయ్యే సరికే నా పని సగం పూర్తయింది. లాస్ట్ గేమ్‌లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించుకోవడానికి నాకు చాలా టైం దొరికింది' అని చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల సంఖ్య 14కు చేరింది. ఆడిన పది మ్యాచల్లో ఏడింట గెలిచిన గుజరాత్ మరోసారి ఈజీగా ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది.

Story first published: Saturday, May 6, 2023, 7:20 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+