Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsLSG : నీకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందే.. రాహుల్‌ను తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ పెద్ద స్కోరు చెయ్యలేకపోయింది. కేవలం 135 పరుగులే చేయగలిగింది. ఇంత చిన్న స్కోరును ఛేజ్ చేయడంలో లక్నో విఫలమైంది. మ్యాచ్ చూసిన వాళ్లందరూ లక్నో ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ మాత్రం అందరూ అనుకున్నట్లు సాగలేదు.

తొలి 16 ఓవర్ల వరకు లక్నో విజయం దిశగానే సాగింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా మ్యాచ్ మలుపు తిరగింది. కేఎల్ రాహుల్ మరీ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. కృనాల్ పాండ్యా అవుటైన తర్వాత రాహుల్ మరీ డిఫెన్స్‌లో పడిపోయాడు. డాట్ బాల్స్, సింగిల్స్ తీస్తూ మ్యాచ్‌ను చివరి వరకు లాక్కెళ్లాడు. మధ్యలో కనీసం ఒకటో, రెండో బౌండరీలు బాదినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.

kl rahul lsg

ఈ మ్యాచ్ తొలి ఓవర్‌ను రాహుల్ మెయిడెన్ ఆడాడు. షమీ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా తీయలేదు. ఆ తర్వాత కొంచెం వేగం పెంచాడు. కానీ చివర్లో మళ్లీ జిడ్డు బ్యాటింగ్ చేసి జట్టు ఓటమికి కారణం అయ్యాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్‌కు చాలా కోపం వచ్చింది. రాహుల్ మరీ దారుణంగా ఆడుతున్నాడని, అది టీ20 మ్యాచ్ అని మర్చిపోయినట్లు కనిపిస్తున్నాడని మండిపడుతున్నారు.

'మ్యాచ్‌ను డీప్‌కు తీసుకెళ్లడం కరెక్టే.. కానీ అక్కడ ఉండేది 20 ఓవర్లే. అది మర్చిపోయి 25 ఓవర్లు బ్యాటింగ్ చేస్తానంటే కుదరదు. ఆ విషయం రాహుల్‌కు తెలియడం లేదు' అంటూ వెటకారం ఆడుతున్నారు. అంతేకాదు, గంభీర్‌ కచ్చితంగా రాహుల్‌కు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇస్తాడని జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోవడానికి కారణం మాత్రం రాహులే అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

అతనే 20వ ఓవర్ రెండో బంతి వరకు ఆడాడు. దీంతో లక్నో మిడిలార్డర్‌కు ఆడేందుకు ఎక్కువ బాల్స్ కూడా మిగల్లేదు. కేవలం నికోలస్ పూరన్ మాత్రమే 6 బంతులు ఆడాడు. కానీ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. మిగతా వాళ్లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఓటమికి కారణం రాహులే అని ఫ్యాన్స్ తేల్చేశారు.

Story first published: Sunday, April 23, 2023, 12:06 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+