లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్), వృద్ధిమాన్ సాహా (81) ఇద్దరూ చెలరేగారు. దీంతో ఆ జట్టు ఏకంగా 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో లక్నోకు కూడా మంచి ఆరంభమే లభించింది.
లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ 32 బంతుల్లో 48 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ క్వింటన్ డీ కాక్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో ఆ జట్టు లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కైల్ మేయర్స్ ఇచ్చిన ఒక క్యాచ్‌ను రషీద్ నేలపాలు చేశాడు. కళ్లలో ఎండ పడటంతో అతను బంతిని అందుకోలేకపోయాడు.

ఈ తప్పును సరిదిద్దుకోవడానికి రషీద్‌కు 9వ ఓవర్లో అవకాశం దక్కింది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో మరో భారీ షాట్ ఆడేందుకు మేయర్స్ ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి.. డీప్ ఫైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్‌కు దూరంగా పడేలా కనిపించింది. అయితే ఎలాగైనా దీన్ని పట్టేయాలని కసిగా పరిగెత్తిన రషీద్.. చివర్లో కాలు జారి కింద పడిపోయినంత పనిచేశాడు.
అయినా సరే తన టార్గెట్ మిస్ అవలేదు. చేతులు బలంగా ముందుకు జాచి బంతిని పట్టేశాడు. అతను ఈ క్యాచ్ అందుకున్న తీరు చూసిన ఫ్యాన్స్ అంతా షాకైపోయారు. కాసేపు రషీద్ ఖాన్ కూడా ఆశ్చర్యపోయాడు. సుమారు 26 మీటర్లు పరిగెత్తుకొచ్చిన రషీద్ ఈ క్యాచ్ అందుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇలా కైల్ మేయర్స్‌కు తను ఇచ్చిన లైఫ్‌ను తిరిగి తనే తీసేసుకున్నాడు.
మేయర్స్ అవుట్ అవడంతో క్రీజులోకి దీపక్ హుడా వచ్చాడు. లక్నో ఈ మూవ్ చూసిన చాలా మంది పెదవి విరుస్తున్నారు. హుడా ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేడని, అలాంటప్పుడు యువ ప్లేయర్ ఆయుష్ బదోనీని పంపాల్సిందని అంటున్నారు. అంతకుముందు ఈ స్థానంలో బదోనీ మంచి ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.