Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsLSG : ఓడిపోతాం అనుకున్నా.. కానీ ఆ దేవుడే గెలిపించాడు: హార్దిక్ పాండ్యా

లక్నోపై గుజరాత్ టైటాన్స్ అనూహ్య విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత చాలా వరకు లక్నోనే ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఈ నిర్ణయం పెద్దగా కలిసి రాలేదు. లక్నో బౌలర్ల ముందు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడింది. దీంతో కేవలం 135 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసేలా కనిపించిన లక్నో చివరకు ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ కేవలం 68 పరుగులే చేశాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా అవుటైన తర్వాత మరీ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. మరీ ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాడు. దానికితోడు చివరి ఐదు ఓవర్లలో మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులే చేసింది. గుజరాత్ 7 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

Hardik Pandya reaction

ఈ విజయం గురించి మాట్లాడిన గుజరాగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ భగవంతుడే తమను గెలిపించాడని అన్నాడు. 'వరుసగా రెండు మ్యాచులో ఓడిపోయిన తర్వాత ఇలా గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ మ్యాచ్‌ను మీ దగ్గర నుంచి తీసుకెళ్లడమే కాదు.. అప్పుడప్పుడూ ఇలా ఇస్తూ ఉంటాను కూడా అని దేవుడు చెప్పినట్లే ఫీల్ అవుతున్నా. మేం వికెట్లు తీసుకున్నప్పుడు మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మాపై మేం ఉంచుకున్న నమ్మకం అద్భుతంగా అనిపించింది' అని చెప్పాడు.

ఐపీఎల్ వంటి టోర్నీలో ఒక్క ఓటమి కూడా నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హార్దిక్ అన్నాడు. అదే సమయంలో ఇలాంటి విజయాలు ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయన్నాడు. 'ఈ పిచ్‌పై ఎంత కష్టపడినా మరో పది పరుగులు చేయగలిగే వాళ్లం అంతే. క్రీజులో కుదురుకున్న బ్యాటరే భారీ షాట్లు ఆడాలని మాకు అర్థమైంది. ఎందుకంటే కొత్త బ్యాటర్ ఈ పిచ్‌పై ఆడటం చాలా కష్టంగా ఉంది' అని వివరించాడు.

లక్నో జట్టు 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు తాము వెనుక బడినట్లు అనుకున్నామని హార్దిక్ తెలిపాడు. 'నాలుగు ఓవర్లలో 27 పరుగులు అవసరం అయినప్పుడు గెలిచే ఛాన్స్ ఉందనిపించింది. అలాంటప్పుడు చిన్న తప్పు చాలు మ్యాచ్ చేజారడానికి. మోహిత్ చాలా అనుభవం ఉన్న ప్లేయర్. తను ఎలా బౌలింగ్ వేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కామ్‌గా ప్లాన్లు వేసి, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తీరు అద్భుతం' అని కొనియాడాడు.

మోహిత్ చివరి ఓవర్ వేసిన తీరు సూపర్‌ అని, మహమ్మద్ షమీ కూడా అంత అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాడు. వీళ్లిద్దరూ చాలా చక్కగా ఆడారన్నాడు. చాలా కాలం తర్వాత ఆడుతూ కూడా రాణించిన జయంత్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని హార్దిక్ చెప్పాడు. అతనే కాకుండా అఫ్ఘాన్ యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా చాలా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ అని మెచ్చుకున్నాడు.

Story first published: Saturday, April 22, 2023, 23:41 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+