Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsLSG : ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది: హార్దిక్ పాండ్యా

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. లక్నోను ఏకంగా 56 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటుతో అదరగొట్టింది. వృద్ధిమాన్ సాహా (81), శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్) ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు ఏకంగా 227 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇంత భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో లక్నో కూడా ఇన్నింగ్స్‌ను చక్కగానే ఆరంభించింది. కైల్ మేయర్స్ (48), క్వింటన్ డీకాక్ (70) ఇద్దరూ అదరగొట్టారు. కానీ ఆ తర్వాత లక్నో బ్యాటింగ్ లైనప్ తడబడింది. మూడో స్థానంలో వచ్చిన దీపక్ హుడా (11) చాలా నెమ్మదిగా ఆడాడు. దీంతో ఒత్తిడికి గురైన స్టొయినిస్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

Hardik Pandya

చివర్లో ఆయుష్ బదోనీ (21) ఫర్వాలేదనిపించినా.. నికోలస్ పూరన్ (3) మళ్లీ విఫలమయ్యాడు. దీంతో లక్నో టీం చాలా ఘోరంగా 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంపై గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా స్పందించాడు. 'ఇంతకన్నా బెటర్‌గా ఏమీ అడగడానికి లేదు. ఒక్క రోజు గ్యాప్‌లో అదీ ఇంత ఎండలో మా వాళ్లు చాలా బాగా ఆడారు. ఈ మ్యాచ్‌ను మార్చింది మాత్రం రషీద్ అందుకున్న సూపర్ క్యాచే' అని చెప్పాడు.

'ఆ క్యాచ్ తర్వాత మ్యాచ్ మా కంట్రోల్‌లోకి వచ్చింది. రెండు టీమ్స్ 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుండగా.. ఈ క్యాచ్ స్పీడ్ బ్రేకర్‌లా వచ్చింది. ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడానికి కృనాల్‌కు అవకాశం ఉందని అనుకోవడం లేదు. మా మధ్య అనుబంధం చాలా బలమైంది. తను ఇంకా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నా. మ్యాచ్ మరింత థ్రిల్లింగ్‌గా జరిగి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. అప్పుడు కృనాల్ కూడా చెప్పుకోవడానికి ఉండేది' అని నవ్వేశాడు.

Story first published: Sunday, May 7, 2023, 23:33 [IST]
Other articles published on May 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+