లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా మొదట బౌలింగ్ తీసుకున్నాడు. బరిచిన అతను.. ఇదే నమ్మకంతో ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాడు. కానీ సాహా, శుభ్‌మన్ గిల్ జోడీ ఈ నమ్మకంపై నీళ్లు కుమ్మరించింది.
ఈ జోడీ ఆరంభం నుంచే లక్నో బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనితోపాటు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సాహా అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (25) కూడా భారీ షాట్లు ఆడాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఇలా క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ భారీ షాట్లు ఆడటంతో లక్నో బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడానికి కృనాల్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ఉపయోగించాడు. అయినా సరే వారి ఇన్నింగ్స్‌కు బ్రేకులు వేయలేకపోయాడు. మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నా.. ఆవేష్, కృనాల్ మినహా ప్రతి బౌలర్ 10పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చారు.
అయితే గుజరాత్ ఆరంభం చూసిన ఫ్యాన్స్ ఈ జట్టు ఈజీగా 250పైగా స్కోరు చేస్తుందని అనుకున్నారు. కానీ చివర్లో కొంత పుంజుకున్న బౌలర్లు.. గుజరాత్‌ను కొంత కట్టడి చేశారు. ఈ క్రమంలో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మరి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో చూడాలి.