గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు జట్లు మరో సూపర్ హిట్ షోడౌన్‌కు రెడీ అయ్యాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి, ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది. అదే సమయంలో ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా విజయాలు సాధించిన రెండు జట్లలో గుజరాత్ ఒకటి కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని కేకేఆర్ అనుకుంటోంది.
ఈ మ్యాచ్‌కు ముందే కోల్‌కతాకు గట్టి దెబ్బ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న బంగ్లాదేశ్ స్టార్ లిటాన్ దాస్.. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంటికి వెళ్లిపోయాడు. అతను ఆడింది ఒక్క మ్యాచే అయినా.. లిటాన్‌పై కేకేఆర్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఇప్పుడు అతను లేకపోవడం ఆ టీంకు చాలా పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా.. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ వర్షం పడే అవకాశం ఉండటంతోపాటు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాండ్యా వెల్లడించాడు. సూర్యుడు ఏమాత్రం కనిపిస్తున్నా తాను ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని చెప్పాడు. ఇక తమ జట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదని, చివరి మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని చెప్పాడు. శుభ్‌మన్ గిల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నట్లు తెలిపాడు.
కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా మాట్లాడుతూ తాను టాస్ గెలిచి ఉన్నా ముందుగా బ్యాటింగే చేసేవాళ్లమని తెలిపాడు. వర్షం పడే అవకాశం ఉన్నా కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నట్లు వెల్లడించాడు. అలాగే మరో షాకింగ్ న్యూస్ కూడా వెల్లడించాడు. చిన్న గాయం కారణంగా స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని, అతని స్థానంలో రహ్మనుల్లా గుర్బాజ్ ఆడుతున్నాడని తెలియజేశాడు.
అంతేకాదు, వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ కూడా గాయపడినట్లు చెప్పుకొచ్చాడు. అతని స్థానంలో హర్షిత్ రాణా ఆడుతున్నట్లు తెలిపాడు. ఇలా జేసన్ రాయ్, ఉమేష్ యాదవ్ ఇద్దరూ ఈ మ్యాచ్ ఆడకపోవడం కచ్చితంగా కేకేఆర్‌కు నష్టమే అని నిపుణులు అంటున్నారు. అయితే శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నట్లు తెలిపాడు.
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్, నూర్ అహ్మద్
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మనుల్లా గుర్బాజ్, ఎన్ జగదీశన్, వెంటకేశ్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.