Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsDC : మా ప్లాన్ ఫెయిలైంది.. కానీ ఆ ఒక్కడి వల్ల గెలిచాం: డేవిడ్ వార్నర్

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్‌కు టేబుల్ అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 130 పరుగులు మాత్రమే చేసింది.

ఛేజింగ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ అనూహ్య విజయంపై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

David Warner

'మా బౌలర్లు అమేజింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. మా బ్యాటర్లు మాత్రం షమీ బౌలింగ్ వల్ల తడబడ్డారు. అయితే అమన్, రిపల్ పటేల్ ఫెంటాస్టిక్ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కగా ముగించాం. ఈ మ్యాచ్ నెయిల్ బైటర్‌లా సాగింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయాం. దీంతో చాలా టెన్షన్ పడిపోయాం. ఒకరు రనౌట్ కూడా అయ్యారు. మా బ్యాటింగ్‌లో సమస్య ఎక్కడుందో నాకు తెలియడం లేదు' అని వార్నర్ అన్నాడు.

తాము పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడాలని నిర్ణయించుకున్నామని, కానీ అది అనుకున్నట్లు జరగలేదని తెలిపాడు. కానీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు. 'క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడాలి. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని వికెట్లు తీసుకోవాలని ముందే అనుకున్నాం. ఫిట్‌గా ఉన్నా కూడా ఖలీల్ చివరి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు' అని గుర్తుచేశాడు.

'ఇషాంత్ మళ్లీ కుర్రాడిలా పెర్ఫామెన్స్ ఇవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చివరి ఓవర్లో అంత టెన్షన్‌ను భరించాడంటే మాటలు కాదు. తెవాటియా చెలరేగడం చూసి నాకే టెన్షన్ పెరిగిపోయింది. తను చేసే పనే అది కదా. మా బెస్ట్ డెత్ బౌలర్ ఆన్రిచ్, అందుకే అతనికి బంతి ఇచ్చా. కానీ చివర్లో చాలా క్లారిటీతో బౌలింగ్ చేసిన ఇషాంత్ ఈ విజయం అందించాడు' అని మెచ్చుకున్నాడు.

Story first published: Wednesday, May 3, 2023, 8:02 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+