Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : మేమే గెలుస్తాం.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరతాం: శుభ్‌మన్ గిల్

ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను అడ్డుకోవడం చెన్నైకి సవాల్‌గా మారనుంది. వరుస మ్యాచుల్లో సెంచరీలు బాదిన గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గుజరాత్‌కు మంచి ఆరంభం అందించేందుకు అతను రెడీ అవుతున్నాడు. తాజాగా ఆర్సీబీపై గుజరాత్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

GTvsCSK qualifier-1 Today IPL Match Shubman Gill says Gujarat will win

ఈ క్రమంలోనే తొలి క్వాలిఫైయర్‌లో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడీ కుర్ర బ్యాటర్. మ్యాచులు జరిగే కొద్దీ చెపాక్ పిచ్ మరింత స్లోగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిచ్‌కు సరిగ్గా సరిపోయే బౌలింగ్ ఎటాక్ తమ వద్ద ఉందని గిల్ చెప్తున్నాడు. కాబట్టి తాము క్వాలిఫైయర్-1 గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్ చేరతామని అంటున్నాడు.

'ఈ మ్యాచ్ కచ్చితంగా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. అయతే ఈ వికెట్‌కు సరిగ్గా సరిపోయే బౌలింగ్ మా దగ్గర ఉంది. కాబట్టి వరుసగా రెండోసారి కూడా మేం ఫైనల్ చేరుకుంటామని ఆశిస్తున్నా' అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ఈ టీంలో కేవలం గిల్ మాత్రమే కాదు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

సెంచరీలపై సెంచరీలు బాదుతున్న గిల్‌ను పక్కన పెడితే.. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతనికి తోడుగా మరో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ఆకట్టుకుంటున్నాడు. వీళ్లిద్దరూ కనుక రాణిస్తే చెపాక్‌లో గుజరాత్‌ను ఓడించడం చెన్నైకి కష్టమే.

అలాగే మహమ్మద్ షమీ కూడా కొత్త బంతితో ఇరగదీస్తున్నాడు. అతనే ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్ కూడా. ఈ లెక్కన చూస్తే గుజరాత్ జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఈ జట్టును ఓడించడం చెన్నైకి సవాల్ అని చెప్పాలి. దానికితోడు ఇప్పటి వరకు గుజరాత్‌పై చెన్నై ఒక్కసారి కూడా గెలవలేదనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.

Story first published: Tuesday, May 23, 2023, 10:20 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+