Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : చెన్నైకి అతనితోనే డేంజర్.. గుజరాత్ ట్రంప్ కార్డ్ ఎవరో చెప్పేసిన సెహ్వాగ్!

ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు హోరా హోరీగా తలపడతాయని అనిపిస్తోంది.

రెండు బలమైన జట్ల మధ్య పోరు అంటే అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలోనే క్వాలిఫైయర్‌లో ఏ జట్టుకు ఎవరు బలం అని తెగ చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. తాజాగా తొలి క్వాలిఫైయర్ గురించి మాట్లాడిన సెహ్వాగ్.. గుజరాత్‌ జట్టులో ట్రంప్ కార్డ్ ఎవరో చెప్పాడు.

shehwag

'గుజరాత్‌కు ట్రంప్ కార్డ్ రషీద్ ఖాన్. ఈ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆ జట్టు కనుక వికెట్లు తీసుకోవాలి అనుకుంటే అతను రంగంలోకి దిగాల్సిందే. అలాంటి రషీద్‌ను హార్దిక్ అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. అవతలి జట్టు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పితే రషీద్ చూడలేడు. దాన్ని విడగొట్టే వరకు నిద్రపోడు' అని వివరించాడీ లెజెండ్.

ఈ సీజన్‌లో రషీద్ బెస్ట్ బౌలర్‌గా ఎదిగాడని సెహ్వాగ్ అన్నాడు. 'అద్భుతంగా రాణిస్తూ ఈ సీజన్‌లో సూపర్ పెర్ఫామర్‌గా ఎదిగాడు' అని మెచ్చుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో 7.82 ఎకానమీతో 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మహమ్మద్ షమీతో పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడుతున్నాడు.

చెపాక్ పరిస్థితులు కూడా రషీద్ బౌలింగ్‌కు చాలా సహకరిస్తుంది. ఈ క్రమంలో గుజరాత్ ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌పై మరీ ఎక్కువ ఆధార పడేలా కనిపిస్తోంది. అలాగే మరో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో రషీద్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Story first published: Tuesday, May 23, 2023, 16:31 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+