Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఆ డిన్నర్ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు.. వెల్లడించిన చెన్నై టీంమేట్స్!

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకడు. ఐపీఎల్‌లో కూడా ధోనీ చాలా సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది కూడా జట్టును ముందుండి నడిపిస్తూ ప్లేఆఫ్స్‌కు తీసుకొచ్చాడు. గుజరాత్‌తో తొలి క్వాలిఫైయర్ ఆడేందుకు చెన్నై రెడీ అవుతోంది. ఈ క్రమంలో మాజీ చెన్నై టీంమేట్స్ కొందరు కలిసి ధోనీ జట్టులో తమ అనుభవాన్ని పంచుకున్నారు.

ఐపీఎల్‌లో రెండేళ్లు చెన్నైని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రీఎంట్రీలో చెన్నై అదరగొట్టింది. ఏకంగా టైటిల్ నెగ్గింది. ఆ ఏడాది టీం డిన్నర్ సందర్భంగా జరిగిన ఒక షాకింగ్ ఘటనను హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. అది తాను ఎప్పటికీ మర్చిపోలేని ఘటన అని చెప్పాడు.

ms dhoni harbhajan singh

'ఈ కథ ఎవరికీ తెలీదు. అందుకే నేను చెప్పాలని అనుకుంటున్నా. 2018లో రెండేళ్ల బ్యాన్ తర్వాత చెన్నై జట్టు మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అప్పుడు టీం డిన్నర్ జరిగింది. మామూలుగా మగాడి కంట కన్నీళ్లు రావు అంటూ డైలాగులు వింటుంటాం కదా.. కానీ ఆ రోజు డిన్నర్ సమయంలో ధోనీ ఏడ్చేశాడు' అని హర్భజన్ గుర్తుచేసుకున్నాడు.

ధోనీ ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయిపోయాడని చెప్పిన హర్భజన్.. దీని గురించి ఎవరికీ తెలియదు. అందుకే చెప్తున్నా' అని భజ్జీ తెలిపాడు. అప్పుడు పక్కనే సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా ఉన్నాడు. అతను కూడా 2018లో ఐపీఎల్ నెగ్గిన చెన్నై జట్టులో సభ్యుడే. అతను కూడా ఈ ఘటన గురించి చెప్పాడు.

'అఫ్‌కోర్స్, నేను కూడా అక్కడే ఉన్నా. ఆ క్షణం ఎంఎస్ ధోనీకి చాలా ఎమోషనల్. అతన్ని అలా చూస్తే.. అతను ఈ టీంను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. జట్టును తన ఫ్యామిలీ అనుకుంటాడు ఎంఎస్. అతన్ని అలా చూసి మేం అందరం కూడా ఎమోషనల్ అయిపోయాం' అని వెల్లడించాడు.

Story first published: Tuesday, May 23, 2023, 17:49 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+