Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : ఇలాగైతే గుజరాత్ గెలుపు ఖాయమే!.. చెన్నైకి చుక్కలు చూపించడానికి రెడీ?

ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి. అవేంటంటే..

సూపర్ ఫామ్: గుజరాత్ ఆటగాళ్లలో కీలకమైన వాళ్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఇద్దరూ గుజరాత్‌కు మంచి ఓపెనింగ్ అందించడంలో సక్సెస్ అయ్యారు. ఇక మిల్లర్, తెవాటియా కూడా అవకాశం దక్కినప్పుడు రాణిస్తున్నారు. బౌలర్లు అదిరిపోయే ఫామ్ కనబరుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ జట్టును అడ్డుకోవడం చెన్నైకి కష్టమే అని నిపుణులు అంటున్నారు.

GTvsCSK qualifier 1

చెన్నైకి చెక్ పెట్టే బౌలింగ్: సీఎస్‌కే బ్యాటింగ్‌లో ఓపెనర్లే కీలకం. అయితే వాళ్లిద్దరూ ఇన్నింగ్స్ ఆరంభంలో కొంత తడబడుతున్నారు. దీన్ని చక్కగా క్యాష్ చేసుకునే బౌలర్ మహమ్మద్ షమీ. అతని బౌలింగ్‌ను కాన్వే, గైక్వాడ్ ఎలా ఎదురుకుంటారనేది చూడాలి. ఇక మిడిలార్డర్‌లో చెన్నై పూర్తిగా శివమ్ దూబే ఫామ్‌పై ఆధార పడుతోంది. స్పిన్నర్లకు దూబే చుక్కలు చూపిస్తున్నాడు.

అయితే అతను రషీద్ ఖాన్‌ను అంత ఈజీగా ఎదుర్కోలేడు. దూబే మాత్రమే కాదు ధోనీ, జడేజా, రహానే ఎవరైనా సరే రషీద్‌ను ఎదుర్కోవడం కష్టమే. స్పిన్నర్లపై వీళ్ల గణాంకాలు అంత గొప్పగా లేకపోవడం కూడా గమనార్హం.

చెపాక్‌పై చెలరేగే స్పిన్: ఈ మ్యాచ్ జరిగే చెపాక్‌లో చెన్నై స్పిన్ ఆ జట్టుకు ప్రధాన బలం. కానీ గుజరాత్ ఆ కోవలోకి రాదు. ఎందుకంటే ఆ టీంలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వీళ్లిద్దరూ బ్యాటర్లను తికమక పెట్టి వికెట్లు తీయగల సమర్ధులే. వీరే కాకుండా అవసరం అనుకుంటే జయంత్ యాదవ్, సాయి కిషోర్‌ను కూడా హార్దిక్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది.

Story first published: Tuesday, May 23, 2023, 13:49 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+