Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : చెపాక్‌లో చెన్నైని ఓడించడమా?.. చెన్నై విజయానికి కలిసొచ్చే అంశాలివే..!

ఐపీఎల్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో పదింట జయభేరి మోగించిన గుజరాత్ అగ్రస్థానంలో లీగ్ దశను ముగించింది. ఇక గతేడాదితో పోలిస్తే అద్భుతంగా పుంజుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్ వేదికగా తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నైకి గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే?

నిలకడైన జట్టు: ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్లలో చెన్నై ముందు ఉంటుంది. ఈ సీజన్‌లో కూడా అదే కనిపించింది. ఈ జట్టులో పెద్దగా ఎలాంటి మార్పులూ లేవు. ఆటగాళ్లపై నమ్మకంతో స్పష్టమైన పాత్రలు అప్పగించింది టీం మేనేజ్‌మెంట్. వాళ్లు నెమ్మది నెమ్మదిగా ఆ పాత్రలకు న్యాయం చేసే విధంగా ఎదిగారు.

csk chepauk stadium

ఈ ఏడాది మహీష్ తీక్షణ జర్నీ చూస్తే ఈ జట్టు ఎంతలా ఆటగాళ్లను మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు. సీజన్ ఆరంభంలో తేలిపోయిన అతను.. చివరకు వచ్చే సరికి చాలా ప్రమాదకరంగా మారిపోయాడు. ఈ సీఎస్కే ఎఫెక్ట్‌ను మర్చిపోతే డేంజరే. ప్రస్తుతం ఆ జట్టు పర్‌ఫెక్ట్ స్టేజ్‌లో ఉందని చెప్పొచ్చు.

సూపర్ ఓపెనర్లు: ఈ ఏడాది ఐపీఎల్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీ పోటీలో సీఎస్కే ఓపెనర్లు కూడా ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఇద్దరూ కూడా తమదైన టెక్నిక్‌తో ఆ జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్నారు. జాగ్రత్తగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తున్నారు. ఈ సీజన్‌లో కాన్వే 53.18 సగటు, 138.62 స్ట్రైక్ రేటుతో ఏకంగా 585 పరుగులు చేశాడు.

గైక్వాడ్ కూడా 500 మార్కును దాటాడు. అతని సగటు 42 కొంత తక్కువగా ఉన్నా.. స్ట్రైక్ రేటు 148.23 మెరుగ్గా ఉంది. వీరు కచ్చితంగా గుజరాత్‌కు సమస్యలు సృష్టించగలరు. గుజరాత్ కనుక గెలవాలంటే వీళ్లను ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపితే అంత మంచిది. లేదంటే మ్యాచ్‌ను గుజరాత్ చేతుల్లో నుంచి ఈ ఓపెనర్లే లాగేసుకుంటారు.

చెపాక్ ఇంపాక్ట్: హోం గ్రౌండ్ అడ్వాంటేజిని అద్భుతంగా ఉపయోగించుకునే జట్లలో చెన్నై ఒకటి. స్పిన్‌కు సహకరించే చెపాక్‌లో చెన్నైని ఓడించడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన 67 మ్యాచుల్లో 45 మ్యాచుల్లో చెన్నై జయభేరి మోగించింది. గుజరాత్‌కు కూడా ఇక్కడ చెన్నైని ఓడించడం కష్టమే.

దానికితోడు ఈ ఏడాది చెన్నై ఎక్కడ ఆడుతున్నా సరే.. అభిమానులు కోకొల్లలుగా అక్కడకు వెళ్లిపోయి తమ జట్టుకు మద్దతు ఇచ్చారు. అలాంటిది చెపాక్‌లో మ్యాచ్ అంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ మ్యాచ్‌లో స్టేడియం మొత్తం ఎల్లోవ్‌లో మునిగిపోవడం ఖాయం.

Story first published: Tuesday, May 23, 2023, 15:00 [IST]
Other articles published on May 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+