నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా మూడోసారి గుజరాత్ టైటాన్స్ చేతలో ఓడింది. మ్యాచ్ మొదలైన తర్వాత రుతురాజ్ భారీ ఇన్నింగ్స్ చూసిన చెన్నై అభిమానులు తెగ సంతోషించారు. ఈ గుజరాత్ గండం గెట్టెక్కుతుందనే భావించారు. కానీ కాసేపటికే పరిస్థితి తిరగబడింది. అనుభవం లేని చెన్నై బౌలింగ్‌ను శుభ్‌మన్ గిల్ (63) మైదానం నలువైపులా బాదేశాడు.
అయితే గిల్, విజయ్ శంకర్ (27) అవుటైన తర్వాత మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో రాహుల్ తెవాటియా (15 నాటౌట్), రషీద్ ఖాన్ (10 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్సే గుజరాత్ గెలుపోటమలను శాసం అని చెప్పొచ్చు. అంతకుముందు బౌలింగ్‌లో కూడా రషీద్ చెలరేగాడు.రెండు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. అతను ఈ మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పడం అతిశయోక్తి కాదు.

జట్టు పీకల్లోతో కష్టాల్లో ఉంది. క్రీజులో ఉన్న తెవాటియా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో రషీద్ ఖాన్ క్రీజులో అడుగు పెట్టాడు. వచ్చీ రావడంతనే ధనా ధన్ షాట్లు ఆడిన అతను. కేవలం మూడు బంతులు ఎదుర్కొని ఒక భారీ సిక్సర్, బౌండరీ సాయంతో పది పరుగులు చేశాడు. అతని భారీ షాట్లతో గుజరాత్ విజయానికి చాలా చేరువైంది. అనంతరం రాహుల్ తెవాటియా లాంఛనం పూర్తి చేశాడు. ఈ విజయంతో చెన్నైపై వరుస విజయాలు రికార్డును గుజరాత్ నిలుపుకుంది.
ఇది చూసిన అభిమానులు అందరూ గిల్, రషీద్ ఖాన్ ఇద్దర్నీ తెగ మెచ్చుకుంటున్నారు. వీళ్లిద్దరే చెన్నై ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా రషీద్ ఆడిన కామియో ఇన్నింగ్స్ ఆట గతినే మార్చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ అఫ్ఘాన్ ప్లేయర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని నిపుణులు కూడా అంటున్నారు. అప్పటి వరకు విజయం ఎవరిదో చెప్పడం కష్టంగా ఉండగా.. రషీద్ ఎంట్రీతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసిందని చెప్తున్నారు.