Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : హిస్టరీ రిపీట్.. వరుసగా మూడోసారి చెన్నై ఓటమి.. పోరాడింది అతనొక్కడే!

ఐపీఎల్ స్వీట్ 16 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. ఈ సీజన్ ఓపెనర్ మ్యాచ్‌లో కూడా హిస్టరీ రిపీట్ అయింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. గత ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన గుజరాత్ విజయాలు నమోదు చేసింది. ఈ పరిస్థితిని ఎలాగైనా మర్చాలని, కొత్త సీజన్‌ను విజయంతో మొదలు పెట్టాలని చెన్నై భావించింది.

కానీ చెన్నై అంచనాలు తలకిందులయ్యాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి తన సత్తా చూపించాడు. మణికట్టు గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన అతను.. ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లోనే 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. గుజరాత్‌పై రుతుకు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. గతేడాది ఆడిన రెండు మ్యాచుల్లో కూడా రుతురాజ్ హాఫ్ సెంచరీలతో రాణించాడు.

ruturaj gaikwad csk batting 2

కానీ ఆ రెండు మ్యాచుల్లో కూడా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో చెన్నై అనుకున్న స్కోరు చేయలేక పెవిలియన్ చేరింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. గైక్వాడ్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చెయ్యలేదు. చివర్లో ధోనీ ఒక సిక్స్, ఒక ఫోర్‌ బాదాడు. దీంతో చెన్నై 178/7 స్కోరు చేసింది. మ్యాచ్ ఆరంభంలో రుతురాజ్ బ్యాటింగ్ చూసి ఈ జట్టు 200 స్కోరు దాటుతుందని అనుకున్న ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు.

దీనికితోడు చెన్నైలో అద్భుతమైన బౌలర్లు కూడా లేరు. అరంగేట్ర బౌలర్ రాజ్‌వర్ధన్ హంగ్రేకర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో గుజరాత్ ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. రుతురాజ్ కష్టం బుగ్గిపాలైంది. వరుసగా మూడోసారి గుజరాత్ చేతిలో చెన్నై ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో హిస్టరీ రిపీట్ అయింది.

Story first published: Saturday, April 1, 2023, 8:14 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+