Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GTvsCSK : బౌలర్లకు చుక్కలు చూపించి.. టాప్ స్కోర్లు చేయడానికి వీళ్లు రెడీ!

ఐపీఎల్ 16వ సీజన్ మొదలయ్యేందుకు అంతా సిద్ధమైంది. సీజన్ ఓపెనింగ్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఐపీఎల్‌లో తొలి ప్రయత్నంలోనే ట్రోఫీ నెగ్గిన గుజరాత్, ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన చెన్నై.. ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు పంచే మజానే వేరు. ఈ మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించి, భారీ స్కోర్లు చేయడానికి కొందరు బ్యాటర్లు రెడీగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..

రుతురాజ్ గైక్వాడ్

గతేడాది గుజరాత్, చెన్నై మధ్య రెండు మ్యాచులు జరిగాయి. ఈ రెండింట్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించిన ఏకైక బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. గాయంతో ఆటకు కొంతకాలం దూరమైనా కూడా రుతురాజ్ టచ్ ఎక్కడా పోయినట్లు లేదు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్‌లో చక్కగా బ్యాటింగ్ చేశాడీ యువ బ్యాటర్. గతేడాది ఆరంభంలో కొంత తడబడినా కూడా.. చివరి మ్యాచుల్లో చెలరేగిన రుతురాజ్ భారీ స్కోర్లు చేశాడు. దేశవాళీల్లో కూడా చెలరేగిన అతను.. ఐపీఎల్‌లో కూడా రెచ్చిపోతాడని చెన్నై అభిమానులు అనుకుంటున్నారు.

ipl high score batsmen ready 1

బెన్ స్టోక్స్

ఐపీఎల్ మినీవేలంలో ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతను ఈ ఏడాది ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అంతేకాదు, ఐపీఎల్‌లో కూడా స్టోక్స్ అంతగా రెచ్చిపోయింది లేదు. కానీ చెపాక్‌లో సీఎస్‌కే ప్రాక్టీస్ సెషన్‌లో అతను బాగా ఆడాడు. అంతేకాదు, ఈ సీజన్‌లో స్టోక్స్ స్పెషలిస్టు బ్యాటర్‌గానే బరిలో దిగుతాడని తెలుస్తోంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా అతన్ని ముందుగా పంపే ఛాన్సులు ఉన్నాయి. దీంతో అతను కచ్చితంగా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది.

శుభ్‌మన్ గిల్

ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే అతను శుభ్‌మన్ గిల్. ఈ ఏడాది ఆరంభం నుంచే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను మూడు ఫార్మాట్లలో సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇదే ఫామ్‌ను గిల్ ఈ ఐపీఎల్‌లో కూడా కంటిన్యూ చేస్తాడని గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. గతేడాది జీటీ ట్రోఫీ నెగ్గడంలో కూడా గిల్ పాత్ర చాలా కీలకం. మొత్తం 16 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 483 పరుగులు చేశాడీ ఓపెనర్. సూపర్ ఫామ్‌లో ఉన్న అతను ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Story first published: Friday, March 31, 2023, 16:09 [IST]
Other articles published on Mar 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+