ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో రెండు హేమాహేమీ జట్లు తలపడనున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ట్రోఫీ నెగ్గిన గుజరాత్ టైటాన్స్.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు జట్లు గతేడాది రెండు సార్లు తలపడగా.. రెండు మ్యాచుల్లోనూ విజయం గుజరాత్ టైటాన్స్‌నే వరించింది. దీంతో ఈ ఓపెనింగ్ గేమ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
సరిగ్గా ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఆ టీం కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ప్రాక్టీస్ సమయంలో కుంటుకుంటూ నడవడం వాళ్ల కంట పడింది. మోకాలి నొప్పితో బాధ పడుతున్న ధోనీ.. మైదానం చుట్టూ రౌండ్స్ కూడా సరిగా కొట్టలేకపోయాడు. మధ్య మధ్యలో ఆగుతూ ఎలాగో ఆ రౌండ్స్ పూర్తి చేశాడు. ఇదంతా చూసిన కొందరైతే అసలు తొలి మ్యాచ్‌లో ధోనీ ఆడతాడా? అని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే లీగ్ ఓపెనర్‌లో బరిలో దిగాలనే ధోనీ అనుకుంటున్నట్లు సమాచారం. చెన్నై జట్టు కూడా పెద్దగా మార్పులు లేకుండానే తొలి మ్యాచ్ ఆడనుంది. బ్రావో స్థానంలో బెన్ స్టోక్స్ ఆడుతుండగా.. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన ముఖేష్ చౌదరి స్థానంలో దీపక్ చాహర్ పునరాగమనం చేస్తాడని తెలుస్తోంది. చాహర్, ముఖేష్ ఇద్దరూ ఉండి ఉంటే సిమర్‌జీత్ సింగ్‌కు అవకాశం దక్కేది కాదు.
ఇక గుజరాత్ విషయానికి వస్తే.. మినీ వేలంలో కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన తెలుగు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోందట. దీంతో గిల్, వేడ్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేస్తారు. అలాగే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. మిల్లర్ లేకపోవడంతో ఒడియన్ స్మిత్‌కు అవకాశం దక్కనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయీన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, శివమ్ దూబే, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్
గుజరాత్ టైటాన్స్ (అంచనా): శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, ఒడియన్ స్మిత్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ షమి, శివమ్ మావి/యష్ దయాళ్