Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్‌ మెరుపులు.. 22 బంతుల్లో అర్ధ సెంచరీ

Global T20 Canada :Yuvraj Singh Smashes 5 Sixes In 'Unbelievable Knock' || Oneindia Telugu
GT20 Canada: Yuvraj Singh smashes 5 sixes and Stunning catch in in Global T20 Canada

ఒంటారియో: టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. కెనడా టీ20 లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువరాజ్‌.. బ్రాంప్టాన్‌ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ చేసాడు.

బౌండరీల మోత:

బ్రాంప్టాన్‌ వాల్స్వ్‌ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టోరంటో నేషనల్స్‌ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో యువరాజ్‌ అద్భుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. బ్రాంప్టాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు. కాస్లెన్‌ (35; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.

ధాటిగా ఆడినా:

నవాబ్‌ సింగ్‌ వేసిన 16వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన యువీ.. మూడో బంతిని సైతం భారీ షాట్ ఆడి పెవిలియన్‌ చేరాడు. అనంతరం మెక్లీన్‌గన్‌ (19 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడినా టోరంటో నేషనల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పయి 211 పరుగులు చేసి ఓడిపోయింది. యువరాజ్‌ అద్భుత బ్యాటింగ్‌ చేసినా.. టోరంటోను గెలిపించలేకపోయాడు.

సూపర్ క్యాచ్:

సూపర్ క్యాచ్:

ఈ మ్యాచ్‌లో యువీ ఓ సూపర్ క్యాచ్ కూడా పట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ సిమ్మన్స్ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసి పట్టాడు. అంతకుముందు విన్నీపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన యువీ.. ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.

Story first published: Sunday, August 4, 2019, 13:12 [IST]
Other articles published on Aug 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+