గ్లోబల్ టీ20 కెనడా: మళ్లీ బ్యాట్‌తో మెరిసిన యువరాజ్ సింగ్

బ్రాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో మెరిశాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో యువరాజ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసాడు. లీగ్‌లోని మొదటి మ్యాచ్‌లో నిరాశ పరిచిన యువీ.. అనంతరం రెండు మ్యాచ్‌లలో సత్తా చాటాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

యువరాజ్ మెరుపులు:
గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో యువరాజ్ టోరంటో నేషనల్స్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. సోమవారం బ్రాంప్టన్ వేదికగా విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆకట్టకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేపట్టిన టోరంటోకు ఆరంభం దక్కలేదు. ఓపెనర్ సూరి (5), క్లాసేన్ (15) నిరాశపరిచారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువీ.. మరో ఓపెనర్ రోడ్రిగో థామస్ (65)తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. వచ్చిరావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అనంతరం కీరోన్ పొలార్డ్ (52) కూడా బ్యాట్ జులిపించడంతో టోరంటో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.

ఉత్కంఠ పోరులో విజయం:
217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన విన్నీపెగ్ టాప్ ఆర్డర్ రాణించడంతో చివరి బంతికి విజయం సాధించింది. ఓపెనర్లు క్రిస్ లిన్ (89), షమాన్ అన్వర్ (43).. సన్నీ సొహాల్ (58)లు పరుగులు చేసి ఔట్ అయ్యారు. అనంతరం డుమినీ (3), బ్రేవో (9), తారిఖ్ (3), ఎమ్రిట్ (1)లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. అయితే చివరలో షెహ్దేవ్ (1), గని (1) ఒక్కో పరుగు చేసి విజయాన్ని అందించారు.
సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు:
గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో యువరాజ్, ఆఫ్రిది, గేల్ రాణిస్తున్నారు. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వాన్‌కూవర్ నైట్స్ తరపున ఆడుతున్న 'యూనివర్శల్ బాస్' క్రిస్ గేల్ విశ్వరూపం ప్రదర్శించాడు. 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేసాడు. బ్రాంప్టన్ వోల్వ్స్ తరపున ఆడుతున్న ఆఫ్రిది కూడా 40 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారీ ఇన్నింగ్స్‌లతో ఈ వెటరన్ ఆటగాళ్లు తమలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications