గేల్ విశ్వరూపం: 54 బంతుల్లో 122 పరుగులు.. ఓ బంతి స్టేడియం బయటకు

ఒంటారియో: వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ 'యూనివర్శల్ బాస్' క్రిస్ గేల్ తనలోని విశ్వరూపంను ప్రదర్శించాడు. క్రిస్ గేల్ దెబ్బకు ఓ బంతి స్టేడియం బయటకు వెళ్ళింది. 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఆరంభంలో ఆచితూచి:
లీగ్‌లో భాగంగా సోమవారం వాన్‌కూవర్ నైట్స్, మోంట్రియల్ టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన వాన్‌కూవర్ నైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. ఓపెనర్ గేల్ ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు విస్సే (51)తో కలిసి 63 పరుగులు జత చేసాడు. అనంతరం చెడ్విక్ వాల్టన్‌తో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
గేల్ విశ్వరూపం:
ఈ సమయంలో మరింత దూకుడు పెంచిన గేల్.. మోంట్రియల్ బౌర్లను ఊచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు వాన్ దెర్ డస్సెన్ (56)తో కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి వాన్‌కూవర్ నైట్స్‌కు భారీ స్కోర్ అందించాడు. గేల్ 54 బంతుల్లో 122 పరుగులు చేసాడంటే ఎంత విశ్వరూపం చూపాడో అర్ధం చేసుకోవచ్చు.
మ్యాచ్ రద్దు:
వాన్‌కూవర్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం మోంట్రియల్ టైగర్స్‌కు దక్కలేదు. మోంట్రియల్ ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. వాన్‌కూవర్ ఇన్నింగ్స్ అనంతరం భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే వాన్‌కూవర్ టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగన మ్యాచ్‌లో అఫ్గాన్ 278 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications