Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎందుకు?: క్రిస్ గేల్‌కు బౌలింగ్‌కు చేయనన్న యువరాజ్! (వీడియో)

GT20 Canada 2019 : Yuvraj Singh, Chris Gayle Set To Thrill Cricket Fans || Oneindia Telugu
GT20 Canada 2019: Yuvraj Singh, Chris Gayle Set to Thrill Cricket Fans During Toronto Nationals vs Vancouver Knights Clash

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అభిమానులకు క్రికెట్ మజా పంచేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే గ్లోబల్ టీ20 కెనడా 2019 మెగా టోర్నీలో వీరిద్దరూ తమ జట్లు తరుపున తలపడనున్నారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్, వాంకోవర్ నైట్స్ తలపడుతున్నాయి. టొరంటో నేషనల్స్ జట్టుకు యువరాజ్ కెప్టెన్‌గా వ్వవహారిస్తుండగా... వాంకోవర్ నైట్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. యువీ-గేల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండటంతో ఆసక్తి పెరిగింది.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా వాంకోవర్ నైట్స్

కాగా, ఈ టోర్నీలో వాంకోవర్ నైట్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గ్లోబల్ టీ20 కెనడా 2019 టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. టొరంటో నేషనల్స్, వాంకోవర్ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో యువరాజ్ తొలి విదేశీ దేశవాళీ లీగ్ ప్రారంభమవుతుంది.

యువీ-గేల్ పోటా పోటీగా

యువీ-గేల్ పోటా పోటీగా

యువీ-గేల్ ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ కావడంతో పాటు భారీ షాట్లు ఆడగల క్రికెటర్లు. గ్లోబల్ టీ20 కెనడా 2019 టోర్నీకి సంబంధించి ఆరంభ వేడుకలు గురువారం జరిగే తొలి మ్యాచ్‌కి ముందు నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో క్రిస్ గేల్, యువరాజ్‌లు డ్యాన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

గేల్‌కు మాత్రం బౌలింగ్ చేయను

గేల్‌కు మాత్రం బౌలింగ్ చేయను

ఈ మ్యాచ్‌కి ముందు గేల్, యువీలతో కూడిన ప్రివ్యూ వీడియోని గ్లోబల్ టీ20 కెనడా 2019 ఫేస్‌బుక్ పేజిలో నిర్వాహకులు పోస్టు చేశారు. ఈ వీడియోలో క్రిస్ గేల్ తన బౌలింగ్‌లో యువరాజ్‌ను ఔట్ చేస్తానని అన్నాడు. అందుకు బదులుగా యువరాజ్ మాత్రం తాను గేల్‌కు బౌలింగ్ చేయనని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

టొరంటో నేషనల్స్: యువరాజ్ సింగ్ (సి), కీరోన్ పొలార్డ్, మన్‌ప్రీత్ గోనీ, క్రిస్ గ్రీన్, గులాం షబ్బర్, జెరెమీ గోర్డాన్, రవీందర్‌పాల్ సింగ్, సల్మాన్ నాజర్, రోడ్రిగో థామస్, మార్క్ మోంట్‌ఫోర్ట్, మిచెల్ మెక్‌క్లెనాగన్, కాలమ్ మాక్లియోడ్, చిరాగ్ సూరి (హెన్రిచ్ క్లాసెన్) ), బ్రెండన్ మెక్కల్లమ్,

వాంకోవర్ నైట్స్: క్రిస్ గేల్ (సి), చాడ్విక్ వాల్టన్ (డబ్ల్యుకె), షోయబ్ మాలిక్, టోబియాస్ వైసీ, మైఖేల్ రిప్పన్, అలీ ఖాన్, సాద్ బిన్ జాఫర్, రిజ్వాన్ చీమా, రేయాన్ పఠాన్, హర్ష్ థాకర్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేనియల్ సామ్స్, హేడెన్ వాల్ష్, జెజె స్మిట్, మాథ్యూ నందు

Story first published: Thursday, July 25, 2019, 14:20 [IST]
Other articles published on Jul 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+