IPL 2025 Super Catch: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన కీలక మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడింది. గుజరాత్ టైటాన్స్ గెలిచింది. 38 పరుగుల తేడాతో గుజరాత్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందడగు వేయగా.. సన్ రైజర్స్ మాత్రం సీఎస్కే, రాజస్థాన్ బాటలో ఇంటిముఖం పట్టింది. అయితే ఈ మ్యాచులోనూ ఓ అద్భుతమైన క్యాచ్ నమోదై క్రికెట్ అభిమానులను తెగ అలరించింది.
అంతకుముందు ఈ సీజన్ లో కమిందు మెండీస్, డెవాల్డ్ బ్రెవిస్ కూడా సూపర్ క్యాచులను అందుకుని ఔరా అనిపించారు. ఇప్పుడు రషీద్ ఖాన్ అందుకున్న ఈ సూపర్ క్యాచ్ గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారింది. అలానే ఈ క్యాచ్ తో రషీద్.. 2023లో జరిగిన ఓ సీన్ ను గుర్తు చేాశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ మ్యాచులో మొదట శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76; 10×4, 2×6), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64 ; 3×4, 4×6), సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48; 9×4) రాణించడంతో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కత్ (3/35)తో మెరిశాడు.

32 మీటర్లు పరుగెత్తి మరీ..
అయితే ఛేదనలోనే రషీద్ ఖాన్ అందుకున్న సూపర్ క్యాచ్ నమోదైంది. మొదట అభిషేక్ శర్మ (41 బంతుల్లో 74; 4×4, 6×6), ట్రావిస్ హెడ్ (20; 16 బంతుల్లో 4×4) బలమైన పునాది వేసేందుకు దూకుడుగా ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కలిసి బౌండరీలు, సిక్సర్లతో అభిమానుల్లో ఆశ కలిగించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రసిద్ధ్ విడదీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా హెడ్ బంతిని బాదగా.. రషీద్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడుపుగా క్యాచును అందుకున్నాడు. అది కూడా 32 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వెళ్లి.. బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. దీంతో అభిషేక్, ట్రావిస్ హెడ్ కలిసి తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించాడు. అయితే 2023లోనూ రషీద్ ఖాన్ లక్నోతో జరిగిన మ్యాచులో ఇలాంటి ఓ అద్భుతమైన క్యాచే పట్టుకుని ఔరా అనిపించాడు. దీంతో అప్పటి క్యాచును అందరూ గుర్తు చేసుకుంటున్నారు.