ఫైనల్‌కు గుజరాత్! వైభవ్ సూర్యవంశీ ఆశలపై నీళ్లు?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. నేడు( మే 29న) ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ కీలక పోరుపై ఇప్పుడు వరుణుడి నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ ఈ రోజు ముల్లాన్‌పూర్‌లో భారీ వర్షం, ఈదురు గాలులతో కూడా తుఫాను వచ్చే అవకాశం ఉందని హెచ్చరించడంతో ఇరు జట్లలో.. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో తీవ్ర ఆందోళన మొదలైంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి అద్భుతమైన ఫామ్‌తో క్వాలిఫయర్-2లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి సిక్సర్ల వర్షం కురిపించాడు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగానే హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో గుజరాత్‌ను కూడా ఓడించి ఫైనల్‌కు వెళ్లాలని రాజస్థాన్ భావిస్తోంది. కానీ వాతావరణ నివేదికల ప్రకారం ఈరోజు మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఐపీఎల్ 2026 రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్‌కు మినహా క్వాలిఫయర్ లేదా ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఎటువంటి రిజర్వ్ డే లేదు. అంటే ఒకవేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దయితే దీనిని రేపు నిర్వహించరు. ఒకవేళ మ్యాచ్ కనుక పూర్తిగా రద్దయితే ఐపీఎల్ ప్లేఆఫ్ రూల్స్ ప్రకారం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టుకు ఫైనల్ టికెట్ లభిస్తుంది.
లీగ్ దశ ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాగా రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సమీకరణాల ప్రకారం మ్యాచ్ కనుక రద్దయితే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఒక్క బంతి కూడా ఆడకుండానే టోర్నీ నుంచి దురదృష్టవశాత్తూ నిష్క్రమించాల్సి వస్తుంది. లీగ్ స్టేజ్‌లో స్థిరమైన ప్రదర్శన చేసినందుకు గుజరాత్‌కు ఈ ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి కళ్లు ముల్లాన్‌పూర్‌లో వాతావరణం పైనే ఉన్నాయి. వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా సాగాలని అందరూ కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఆర్సీబీ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. ఈరోజు క్వాలిఫైయర్-2లో గెలిచే జట్టుతో బెంగళూరు ఫైనల్‌లో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

