Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రియాన్ పరాగ్ గోల..! (వీడియో వైరల్)

ఐపీఎల్‌ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 58 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయల్స్‌ బ్యాటర్‌ రియాన్ ప‌రాగ్ ఔటైన విధానం వివాదానికి దారీ తీసింది. పరాగ్ ఔట్ అయినప్పుడు, అతడు అంపైర్‌తో గొడవకు దిగినా ఫలితం దక్కలేదు. దీంతో అతడు నిరాశతోనే క్రీజు వదిలి వెళ్లాడు. డ్రెస్సింగ్‌ రూమ్ కు వెళ్లే దారిలో కూడా అసహనంతో గోడను తన బ్యాట్‌తో కొట్టాడు.

మద్దతుగా పోస్టులు..
రియాన్ పరాగ్ ఔట్ అయ్యాక సోషల్ మీడియాలో అతడి ఔటైన తీరుపై తీవ్రంగా చర్చలు మొదలయ్యాయి. కొంతమంది అతడికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంతమంది అతడు ఔట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం పరాగ్‌ను సమర్థించారు. అప్పుడు బ్యాట్‌ నేలకు తాకడం వల్లే స్పిక్నో మీటర్‌లో స్పైక్స్‌ వచ్చాయని చెబుతున్నారు. బంతి, బ్యాట్‌ కన్నా ముందే ఉందని అంటున్నారు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ అన్యాయంగా ఔట్‌ ఇచ్చారని కామెంట్లు పెడుతూ రియాన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

GT VS RR IPL 2025 Riyan Parag Out or Not Out controversy sparks in social media

అసలేం జరిగిందంటే?
లక్ష్య ఛేదనలో మూడో ఓవర్ లో 12 పరుగులకే తొలి రెండు కీలక వికెట్లను కోల్పోయింది గుజరాత్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ దూకుడుగా ఆడాడు. అయితే ఈ క్రమంలోనే కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్ లో 6.4వ ఓవర్ బంతి.. రియాన్ పరాగ్‌ బ్యాట్‌కు తాకి వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతికి చిక్కినట్లు కనిపించింది. దీంతో అంపైర్‌ ఔట్‌ అన్నాడు. కానీ రియాన్ పరాగ్‌ మాత్రం రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్‌ కూడా బంతి బ్యాట్‌ను తాకిందని తేలుస్తూ ఔట్‌గా ప్రకటించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకలేదని, బ్యాట్‌ మైదానాన్ని తాకిందని.. అందుకే స్పిక్నోమీటర్‌లో స్పైక్స్‌ వచ్చాయని కాసేపు అంపైర్ తో వాదించాడు. కానీ అంపైర్ మాత్రం ఔట్ అని గట్టిగా చెప్పడంతో.. రియాన్ పరాగ్ మైదానం నుంచి అసంతృప్తిగా మైదానం చేరాడు.

Story first published: Thursday, April 10, 2025, 12:15 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+