Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs RCB: సిరాజ్ స్టన్నింగ్ యార్కర్.. ఎగిరిపడిన వికెట్ (Video)

సొంత మైదానంలో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. శుభారంభం దక్కకపోయినా అదిరేలా ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసింది.

సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. డేవిడ్ మిల్లర్‌ (26*; 19 బంతుల్లో, 2x4, 1x6) ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు.

GT vs RCB Watch Siraj s stunning yorker to Shahrukh Khan is the stuff of genius

అయితే షారుక్ ఖాన్‌ను సిరాజ్ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్‌లోనే హైలైట్‌గా నిలిచింది. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో తన స్థానంపై ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ మ్యాచ్‌లో సిరాజ్ గొప్పగా బౌలింగ్ చేశాడు. పేస్ భారాన్ని మోస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న షారుక్‌ను కళ్లుచెదిరే యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు.

సాయి సుదర్శన్‌తో కలిసి షారుక్ ఖాన్ చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 14 ఓవర్లకు 131/2 స్కోరు సాధించింది. ఈ దశలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ సిరాజ్‌కు బంతిని అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ 15 ఓవర్ తొలి బంతికి షారుక్‌ను సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆడటానికి సాధ్యం కానీ రీతిలో బంతిని సంధిస్తూ వికెట్లను పడగొట్టాడు. దీంతో షారుక్-సుదర్శన్ 86 పరుగుల (45 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరపడింది.

అయితే షారుక్ ఔటైన తర్వాత బాదే బాధ్యతను సాయి సుదర్శన్ తీసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న అతను అనంతరం దూకుడు పెంచాడు. మిల్లర్‌తో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. రీన్‌ను లక్ష్యంగా చేసుకోని సుదర్శన్ హ్యాట్రిక్ బౌండరీలు బాది పరుగులు పిండుకున్నాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 47 పరుగులు సాధించింది. సూర్యుడు ప్రతాపానికి ఆర్సీబీ ప్లేయర్లు తీవ్రంగా అలసిపోయారు.

Story first published: Sunday, April 28, 2024, 17:51 [IST]
Other articles published on Apr 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+