For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

GT vs RCB: చరిత్ర సృష్టించిన కోహ్లి

అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. విల్ జాక్స్ (100*, 41 బంతుల్లో, 5x4, 10x6) అజేయ మెరుపు శతకం సాధించాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6x4, 3x6) విధ్వంసం సృష్టించాడు. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8x4, 4x6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3x4, 5x6) అర్ధశతకాలు సాధించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది.

GT vs RCB Virat Kohli has most fifty plus scores in IPL run chases as an Indian

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డు‌లు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఛేదనలో అత్యధిక సార్లు అర్ధశతకాలు సాధించిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఛేజింగ్‌లో ధావన్ 23 సార్లు 50+ స్కోరు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఛేదనలో హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ (35 సార్లు), విరాట్ కోహ్లి (24) , శిఖర్ ధావన్ (23), కేఎల్ రాహుల్ (22), గౌతమ్ గంభీర్ (20) టాప్-5లో ఉన్నారు.

అంతేగాక కోహ్లి ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 500+ పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌తో విరాట్ సమంగా నిలిచాడు. వీరిద్దరు ఏడు సీజన్లలో 500కు పైగా పరుగులు నెలకొల్పారు. వార్నర్, కోహ్లి తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ధావన్, రాహుల్ అయిదు సార్లు 500 మార్క్‌ను అందుకున్నారు. కాగా, ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 71 సగటుతో 500 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

Story first published: Sunday, April 28, 2024, 22:15 [IST]
Other articles published on Apr 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+