Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBకి గుడ్ న్యూస్.. మా స్టార్ ప్లేయర్ తిరిగొచ్చాడు- డుప్లెసిస్

ఐపీఎల్-2024లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. పాయింట్ల పట్టికలో గుజరాత్ ఏడో స్థానంలో, ఆర్సీబీ అట్టడుగన ఉంది.

తదుపరి దశకు చేరుకోవడానికి బెంగళూరుకు అవకాశాలు తక్కువగా ఉన్న సాంకేతికంగా పోటీలోనే ఉంది. దీంతో గుజరాత్‌పై నెగ్గి ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలతో రంగంలోకి దిగుతోంది.

RCB won the toss and chose to bowl

కాగా, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ తమ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ తిరిగి జట్టులోకి వచ్చాడని తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తమ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఛేజింగ్‌లో వికెట్ మెరుగ్గా అవుతుందని భావించి బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపాడు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తామని గిల్ అన్నాడు. గత మ్యాచ్‌లో గొప్పగా పోరాడమని, ఒక్క బంతితో ఓటమిపాలయ్యామని, ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామని గిల్ చెప్పాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు:
విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు:
వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

Story first published: Sunday, April 28, 2024, 15:20 [IST]
Other articles published on Apr 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+