Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణమేంటో చెప్పిన హార్దిక్.. ఆర్సీబీ టీం నుంచి సిరాజ్ ఔట్

GT Vs RCB: Gujarat Titans have won the toss and have opted to bat

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర గేమ్‌కు రంగం సిద్దమైంది. లీగ్ తుది దశకు చేరడంతో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్లేఆఫ్ రేసులో ఉన్న జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. ఇక నేడు ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7.30కు గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. 13 మ్యాచ్‌ల్లో 7విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరి గెలవాలి.

అంతేకాకుండా నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబైతో శనివారం జరిగే మ్యాచ్‌లో ఓడాలి. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీకి ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్ కాబోతుంది. మరోవైపు 10విజయాలు 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి టాప్ 2పొజిషన్లో చోటు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలిచి తమ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ టఫ్‌గా జరగడం ఖాయం.

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు డుప్లెసిస్, హర్దిక్ పాండ్యా గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన హార్దిక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ.. 'మేము బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మేం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఓ ఓవర్ లుక్ కోసం బ్యాటింగ్ దిగాలని నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్ ద్వారా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఎలా ఆడాలో ప్లేఆఫ్‌కు ముందు మరింత అవగాహన తెచ్చుకోవాలనుకున్నాం. ఈ పిచ్ చూస్తుంటే స్కోరుబోర్డుపై మంచి స్కోరును నమోదు చేయవచ్చని అనుకున్నాం. ఇక మా జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. అల్జారీ జోసేఫ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక టాస్ ఓడిన ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోంది. మా టీంలో ఒక్క మార్పు చోటుచేసుకుంది. సిరాజ్ స్థానంలో సిద్ధార్థ కౌల్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ రోజు మేం గెలవాలి, అలాగే ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఏం జరుగుతుందో చూడాలిగా.

తుది జట్లు ఇవే
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (w), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, సిద్దార్థ కౌల్, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Thursday, May 19, 2022, 19:20 [IST]
Other articles published on May 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+