
ఆరంభం అంతంతమాత్రమే
ఇక బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభం అంతంతమాత్రంగానే లభించింది. తొలి ఓవర్ వేసిన సిద్ధార్త్ కౌల్ బౌలింగ్లో సాహా ఫోర్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. గత మ్యాచ్‌లో కనబర్చిన జోరునే సాహా కనబరుస్తూ తొలి ఓవర్లో 2ఫోర్లు, 1సిక్సరు బాది 14పరుగులు పిండుకున్నాడు. మూడో ఓవర్లో శుభమాన్ గిల్ (1) హజిల్ వుడ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయి నిరాశపరిచాడు. ఇక క్రీజులోకి వచ్చీ రాగానే 5వ ఓవర్లో మాథ్యు వేడ్ హజిల్ వుడ్ (16) బౌలింగ్లో 2ఫోర్లు, 1సిక్సర్ తో మంచి టచ్‌లో కన్పించాడు. కానీ మ్యాక్స్ వెల్ అతన్ని ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. ఇక ఈ ఎల్బీడబ్ల్యూ పట్ల వేడ్ చాలా అసహనం వ్యక్తం చేశాడు. మ్యాక్సీ ఆ ఓవర్ మెయిడిన్ చేశాడు.

రనౌట్ వల్ల జోరు మీదున్న సాహా స్వాహా
ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సాహా కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. అయితే వీరి భాగస్వామ్యం ఎక్కువసేపు నిలవలేదు. మిస్ కమ్యూనికేషన్ వల్ల 9వ ఓవర్లో సాహా (31పరుగులు 22బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్) రన్ అవుట్ అయ్యాడు. 62 పరుగులకు 3వికెట్లు పడ్డ గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిల్లర్ కలిసి చక్కదిద్దారు. ఇరువురు అడపాదడపా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ రన్ రేట్ పడిపోకుండా చూశారు. 4వికెట్ కు వీరిద్దరు కలిసి 61పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆర్సీబీ స్పిన్నర్ హసరంగా క్యాచ్ ఔట్ చేశాడు. ఇక తెవాతీయా (2) ఎక్కవ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. హజిల్ వుడ్ వేసిన 18వ ఓవర్లో కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు.

హాఫ్ సెంచరీ చేసుకున్న హార్దిక్
వికెట్లు పడుతుండడంతో స్కోరు 150 దాటుతుందో లేదో అన్న డైలామాలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ (19పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) స్కోరు బోర్డుకు మంచి మూమెంటమ్ ఇచ్చారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన 19వ ఓవర్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీని హార్దిక్ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రషీద్ ఫోర్, సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లో 17పరుగులొచ్చాయి. ఇక హాజిల్ వుడ్ వేసిన చివరి ఓవర్లో హార్దిక్ తొలి బంతికి సిక్సు కొట్టాడు, 4వ బంతికి రషీద్ సిక్సు కొట్టాడు. చివరి ఓవర్లో మొత్తం 17పరుగులు రావడంతో గుజరాత్ 168పరుగులు చేయగలిగింది.

తుది జట్లు ఇవే
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (w), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, సిద్దార్థ కౌల్, జోష్ హేజిల్‌వుడ్


Click it and Unblock the Notifications
