శ్రేయస్ అయ్యర్ మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్ రుచి చూపించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచులో.. 42 బంతుల్లో 5×4, 9×6 పరుగుల సాయంతో 97 నాటౌట్ పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు కోసం తన సెంచరీని కూడా త్యాగం చేశాడు! అతడికి జట్టులోని ఇతర ఆటగాళ్ల సహకారం కూడా దొరకడంతో పంజాబ్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. ఛేదనలో గుజరాత్ ఎంతో కష్టపడినప్పటికీ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఇప్పుడీ మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించింది. ఏ మ్యాచ్ కూడా సాధించని ఘతన అందుకుంది. అలానే ఈ మ్యాచులో కొన్ని సంచలన ప్రదర్శనలు కూడా నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం..
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచులో మొదటగా మాట్లాడుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్. దాదాపు 230.95 స్ట్రైక్ రేట్ తో 9 సిక్సులు, 5 ఫోర్లతో 97 పరుగులు విజృంభించాడు. నెం.3లో వచ్చి అరంగేట్ర ప్లేయర్ ప్రియాంశ్ అరోరా, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్ తో కలిసి బలమైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇకపోతే ఈ మ్యాచులో 3 ఓవర్లుండగానే 90కిపైగా పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. సెంచరీ చేయడం పక్కా అని భావించారు. కానీ అతడు జట్టు కోసం త్యాగం చేశాడనిపించింది. చివర్లో ఎక్కువగా స్ట్రైకింగ్ శాశంక్ నే తీసుకుని భారీ షాట్లు ఆడాడు. దీంతో చివరి ఓవర్లో శ్రేయస్‌కు ఒక్క బంతీ ఆడే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా శ్రేయస్ శతకానికి 3 పరుగుల దూరంలో ఉండిపోవాల్సి వచ్చింది.
అదరగొట్టిన అరంగేట్ర ఓపెనర్
అరంగేట్ర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య.. ఈ మ్యాచులో పంజాబ్ జట్టుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (5) త్వరగానే ఔటైనప్పటికీ.. ప్రియాంశ్ మాత్రం రెచ్చిపోయి ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అందులో 7 బౌండరీలు, 2 సిక్సులు ఉన్నాయి. అయితే కేవలం మూడు పరుగుల దూరంలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. రషీద్ ఖాన్.. ఏడో ఓవర్ లో నాలుగో బంతికి ప్రియాంశ్ ను ఔట్ చేశాడు.
రషీద్ ఖాన్ అరుదైన ఘనత.
గుజరాత్ టైటాన్స్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సష్టించాడు. ఐపీఎల్ లో 150 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. తన 122వ మ్యాచులో 150వ వికెట్ మార్క్ ను అందుకున్నాడు. తద్వారా లసిత్ మలింగ (105 మ్యాచుల్లో), చాహల్ (118 మ్యాచుల్లో) తర్వాత ఈ అరుదైన ఫీట్ టచ్ చేసిన మూడో ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు..
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ అరుదైన చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (19)లు లీగ్‌లో సున్నాకే (డకౌట్) వెనుదిరిగిన ఆటగాడిగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ (18) రికార్డును బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డు..
ఈ మ్యాచులో పరుగుల వరద పారింది. ఇరు జట్ల ఆటగాళ్లు భారీగానే పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో పంజాబ్ 243/5(20) - గుజరాత్ టైటాన్స్ 232/5 (20) రన్స్ చేసింది. దీంతో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 475 పరుగులు నమోదయ్యాయి. తద్వారా ఈ టోటల్ ఇన్నింగ్స్ .. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు కావడం విశేషం. అందుకే ఈ అత్యధిక పరుగులతో పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చరిత్ర సృష్టించనట్టైంది.