Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs LSG: సెంచరీతో మిచెల్ మార్ష్ సంచలనం..ఒకే ఓవర్లో 6,4,6,4,4,1

GT vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన 64వ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తుఫాన్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్‌లో మిచెల్ మార్ష్‌కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ 10 ఫోర్లు, 6 సిక్సర్లు కూడా కొట్టాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్‌తో కలిసి ఐడెన్ మార్‌క్రమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ సమయంలో మిచెల్ మార్ష్ 32 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన అర్థ సెంచరీ తర్వాత మార్ష్ తన సెంచరీని చేరుకోవడానికి కేవలం 24 బంతులను ఎదుర్కొన్నాడు. అర్షద్ ఖాన్ వేసిన 16.5 ఓవర్ కు ఫోర్ బాదిన తర్వాత బంతికి సింగిల్ తీసి మూడంకెల స్కోరును అందుకున్నాడు.

GT vs LSG Mitchell Marsh s Explosive Century A Record-Breaking Over

మరోవైపు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన బౌలర్లలో ఒకరై రషీద్ ఖాన్ ఈ సీజన్ లో తేలిపోతున్నాడు. ఇవాళ లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు చేశాడు. గుజరాత్ తరఫున ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్‌పై మిచెల్ వరుసగా ఐదు బంతుల్లో బౌండరీలు బాదాడు. మార్ష్ తన ఓవర్లో మొత్తం 25 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు, ఒక సింగిల్ ఉన్నాయి. ఒకే ఓవర్లో వరుసగా 6,4,6,4,4,1 బాదాడు. రషీద్ ఖాన్ పై ఇంతకు ముందు ఏ బ్యాట్స్ మాన్ కూడా ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేదు. చివరకు అర్షద్ ఖాన్ వేసిన 18.2వ ఓవర్లో బౌలింగ్ లో మిచెల్ మార్ష్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు.

Story first published: Thursday, May 22, 2025, 21:38 [IST]
Other articles published on May 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+